నేరాలను అరికట్టాల్సిన ఖాకీనే కిలాడీగా మారింది. చేసేది పవర్ఫుల్ ఉద్యోగం.. బుద్ధేమో కంత్రీ బుద్ధి. స్నేహితురాలి ఇంటికొచ్చి ఆమె ఇంటికే కన్నం వేసింది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు చూసి అంతా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహా నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కిలోమీటర్‌కే కొన్ని గంటల సమయం పడుతుంది. ఇక బెంగళూరు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఐటీ, సాఫ్ట్వేర్ కంపెనీలకు నిలయం బెంగళూరు. ఎప్పుడూ ఫుల్ రష్ ఉంటుంది.
బీహార్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు వారం రోజుల సమయమే మిగిలి ఉంది. ఇక దీపావళి, ఛత్ పండుగలు ముగియడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నాయకులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ, అమిత్ షా, కేంద్రమంత్రులు జోరుగా ప్రచారం చేస్తుండగా.. గురువారం ప్రధాని మోడీ పలుచోట్ల ర్యాలీలు నిర్వహించనున్నారు.
దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం అయ్యారు. ఆరేళ్ల తర్వాత ఇద్దరు నాయకులు కలవడం ఇదే తొలిసారి కావడం విశేషం. బుసాన్‌లో జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామంటూ కేంద్ర నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీగా మావోయిస్టులు లొంగిపోయారు.
దక్షిణ కొరియా వేదికగా గురువారం కీలక సమావేశం జరగనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని బుసాన్‌లో
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన రోడ్లపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్ స్కానర్లను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
ప్రధాని మోడీ-ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సారధ్యంలో అభివృద్ధిలో బీహార్ కొత్త శిఖరాలకు చేరిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారం ఉధృతం చేశారు.
దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. ఎక్కడొక చోట అబల బలైపోతుంది. తాజాగా తమిళనాడులో మరో ఘోరం జరిగింది. బైక్ టాక్సీపై వెళ్తున్న మహిళను అమాంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బైక్ వదిలేసి పరారైపోయాడు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా, జపాన్‌లో పర్యటించారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొగుడుతున్నారో.. తిడుతున్నారో తెలియకుండా చాలా నర్మగర్భంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.