బీహార్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు వారం రోజుల సమయమే మిగిలి ఉంది. ఇక దీపావళి, ఛత్ పండుగలు ముగియడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నాయకులంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ, అమిత్ షా, కేంద్రమంత్రులు జోరుగా ప్రచారం చేస్తుండగా.. గురువారం ప్రధాని మోడీ పలుచోట్ల ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Jinping: 6 ఏళ్ల తర్వాత ట్రంప్-జిన్‌పింగ్ తొలిసారి భేటీ
గురువారం ముజఫర్‌పూర్, చాప్రాలో ప్రధాని మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నా రాష్ట్ర సోదరులు, సోదరీమణులు గొప్ప విజయ శంఖం మోగిస్తారని నాకు నమ్మకం ఉంది.’’ అంటూ ప్రధాని రాసుకొచ్చారు. ఎన్డీఏ కూటమి సమగ్ర విజయాన్ని నమోదు చేస్తుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముజఫర్‌పూర్‌లో.. మధ్యాహ్నం 12:45 గంటలకు చాప్రాలో మోడీ ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Jailer 2 : ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్ ఎంట్రీ – డబుల్ డోస్ కన్‌ఫర్మ్!
ఇదిలా ఉంటే బుధవారం ఉదయం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ముజఫర్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ‘ఓట్ల కోసం ఏదైనా చేస్తారని’’ ఆరోపిస్తూ రాజకీయ వివాదానికి తెరలేపారు. ‘‘ఆయన (ప్రధాని మోడీ) మీ ఓటును మాత్రమే కోరుకుంటున్నారు. మీరు ఓట్ల కోసం డ్రామా చేయమని అడిగితే ఆయన అలా చేస్తారు. మీరు ఆయనను ఏదైనా చేయమని బలవంతం చేయవచ్చు. మీరు నరేంద్ర మోడీని డాన్స్ చేయమని చెబితే ఆయన డాన్స్ చేస్తాడు.’’ అని అన్నారు. ‘‘వారు మీ ఓట్లను దొంగిలించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ ఎన్నికల దోపిడీని అంతం చేయాలనుకుంటున్నందున నేను మీకు చెప్తున్నాను. వారు మహారాష్ట్రలో దొంగిలించారు. అటు తర్వాత హర్యానాలో దొంగిలించారు. ఇప్పుడు వారు బీహార్‌లో తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు.’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది.
రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. ఒకరేమో అధికారం నిలబెట్టుకునేందుకు.. ఇంకొకరు అధికారం కోసం పోరాడుతున్నారు.