దక్షిణ కొరియా వేదికగా గురువారం కీలక సమావేశం జరగనుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం కానున్నారు. ఈ సమావేశం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దక్షిణ కొరియాలోని బుసాన్‌లో ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో ట్రంప్-జిన్‌పింగ్ కలవనున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. జిన్‌పింగ్‌ను ముఖాముఖిగా కలవడం ఇదే తొలిసారి. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇద్దరూ సమావేశం అవుతున్నారు.
ఇది కూడా చదవండి: Off The Record: అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి..?
సుంకాలు కారణంగా అమెరికా-చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల చైనాపై భారీగా ట్రంప్ సుంకాలు విధించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇద్దరు నాయకులు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ప్రధానంగా వాణిజ్యం, ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరగవచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Off The Record: జనసేనకు సొంత ఎమ్మెల్యేనే భారమవుతున్నారా..? ఎందుకు..?
ఇదిలా ఉంటే ట్రంప్-జిన్‌పింగ్ సమావేశంపై బీజింగ్ కీలక ప్రకటన విడుదల చేసింది. ‘‘సానుకూల ఫలితాల’’ కోసం కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ పేర్కొన్నారు.
ఐదు రోజుల ఆసియా పర్యటన కోసం ట్రంప్ సోమవారం మలేషియా వచ్చారు. మలేషియా పర్యటన తర్వాత జపాన్‌కు వెళ్లారు. అనంతరం ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు దక్షిణ కొరియాకు వచ్చారు. దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని తిరిగి అమెరికాకు వెళ్లిపోనున్నారు.
ఇదిలా ఉంటే బుధవారం ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకారం సీఈవోల సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో మోడీతో జరిగిన సంభాషణను బహిర్గతం చేశారు. ఒక తండ్రిలా చక్కదిద్దాల్సిన మోడీ.. ఒక హంతకుడిలా ప్రవర్తించారని.. మోడీ నరకం లాంటి కఠినాత్ముడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.