భార్య మతంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహావేషాలు వ్యక్తమవ్వడంతో తాజాగా జేడీ వాన్స్ క్లారిటీ ఇచ్చారు. తన భార్య హిందువు అని.. ఆమెకు మతం మారే ఆలోచన లేదని చెప్పారు.
ముంబై, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.9 కోట్ల విలువ చేసే 9 కేజీల గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి ముంబై, ఢిల్లీకి తరలిస్తుండగా ఇద్దరు స్మగ్లర్ల దగ్గర గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
గాజా-ఇజ్రాయెల్ మధ్య రెండేళ్లు భీకర యుద్ధం జరిగింది. ఈ మధ్యే శాంతి ఒప్పందం జరగడంతో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే యుద్ధ సమయంలో పాలస్తీనా ఖైదీలతో జరిగిన సంభాషణకు చెందిన ఒక వీడియో లీక్ అయింది.
తెలిసీతెలియని వయసులో కొంత మంది యువతీయుకులు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావడం లేదు. తల్లిదండ్రులు గానీ.. పెద్దలు గానీ తప్పు అని చెబితే మాత్రం పగ పెంచుకుంటున్నారు. చివరికి కన్నపేగు బంధాన్ని కూడా తెంచుకోవడానికి వెనుకాడటం లేదు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర హోదా అంశం మళ్లీ రగడ సృష్టిస్తోంది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మధ్య తీవ్ర వివాదం మొదలైంది. రాష్ట్ర హోదా విషయంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మనోజ్ సిన్హా తీవ్రంగా ఆరోపించారు.
భారత్-అమెరికా మధ్య కీలక రక్షణ ఒప్పందం జరిగింది. దశాబ్ద కాలం నాటి రక్షణ చట్టానికి భారతదేశం అమెరికా సంతకం చేశాయి. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ఉండే ఈ ఒప్పందం ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రతా సహకారాన్ని బలోపేతం చేయనుంది.
చార్లీ కిర్క్.. ట్రంప్ సన్నిహితుడు. ఇటీవల దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో చార్లీ కిర్క్ సతీమణి ఎరికా కిర్క్ వెలుగులోకి వచ్చింది. ఇక మరణానంతరం చార్లీ కిర్క్కు దేశ అత్యున్నత పురస్కారం ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా నెలకొన్న కుక్కల బెడదపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఇటీవల కుక్కల సమస్యపై సుప్రీం ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయంగా భారతదేశ గౌరవం డ్యామేజ్ అవుతున్నా మేలుకోరా? అంటూ వ్యాఖ్యానించింది.
ప్రధాని మోడీ శనివారం ఛత్తీస్గఢ్లో పర్యటించనున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రజత్ మహోత్సవం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్సవాలు ప్రారంభించనున్నారు.
న్యాయవాదులకు దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇవ్వడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. దర్యాప్తు సంస్థలు న్యాయవాదులకు సమన్లు జారీ చేయకూడదని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.