మహా నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కిలోమీటర్‌కే కొన్ని గంటల సమయం పడుతుంది. ఇక బెంగళూరు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు నిలయం బెంగళూరు. ఎప్పుడూ ఫుల్ రష్ ఉంటుంది. ఇలాంటి రద్దీలో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం సహజమే. కానీ ఒక జంట మాత్రం సీరియస్‌గా తీసుకుని ఓ యువకుడికి మరణశాసనం రాశారు. కారుతో వెంటాడి హతమార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Bihar Elections: ఊపందుకున్న బీహార్ ఎన్నికల ప్రచారం.. నేడు పలుచోట్ల మోడీ ర్యాలీలు
అక్టోబర్ 25న రాత్రి బెంగళూరు నగరంలోని పుట్టెనహళ్లి ప్రాంతంలో బైక్‌పై దర్శన్, అతని స్నేహితుడు వరుణ్ వెళ్తున్నారు. మార్గమధ్యలో కారు అద్దానికి బైక్ రాసుకుంది. అంతే కారులో ఉన్న దంపతులు మనోజ్ కుమార్, అతని భార్య ఆర్తి శర్మ సీరియస్‌గా తీసుకుని ఆవేశంతో బైక్‌ను 2 కిలోమీటర్ల మేర వెంటాడి ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. కాసేపటికే దర్శన్ చనిపోగా.. స్నేహితుడు వరుణ్ మాత్రం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కొట్టిమిట్టాడుతున్నాడు. ఇక కారు వెంబడించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది కూడా చదవండి: Trump-Jinping: 6 ఏళ్ల తర్వాత ట్రంప్-జిన్‌పింగ్ తొలిసారి భేటీ
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా సీసీకెమెరాల్లో బైక్‌ను కారు ఢీకొట్టినట్లు కనిపించింది. దీంతో నిందితులు మనోజ్‌కుమార్, ఆర్తి శర్మను అరెస్ట్ చేశారు. ఇక వీడియోలో బైక్‌ను ఢీకొట్టి దంపతులు పారిపోయారు. అనంతరం తిరిగి ముసుగులు ధరించి విరిగిపోయిన భాగాలను తీసుకుని వెళ్లిపోయారు. తొలుత ప్రమాదంగా భావించిన పోలీసులు.. వీడియోను పరిశీలించాక హత్య కేసుగా నమోదు చేశారు. నిందితులపై హత్య అభియోగాలు నమోదు చేశారు. కేసును మరింత దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం.. ఆయుధాలతో లొంగిపోయిన 21 మంది మావోలు
