దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామంటూ కేంద్ర నిర్ణయం సత్‌ఫలితాన్ని ఇస్తోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. కాంకేర్ జిల్లాలో 13 మంది మహిళలు సహా 21 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. నక్సలిజం వెన్నెముక విరిగిపోయిందని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి అన్నారు. మార్చి 31, 2026 నాటికి భారతదేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. యువత మావోయిజాన్ని వదిలిపెట్టి.. అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Trump-Jinping: నేడు జిన్‌పింగ్‌తో ట్రంప్ భేటీ.. 6 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!
బస్తర్ ఇన్‌స్పెక్టర్ పి.సుందర్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 26న 21 మంది మావోయిస్టులు.. ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిసి పోయారని తెలిపారు. లొంగిపోయిన వారి కోసం పునరావాసం కలిస్తామని.. అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Prabhas : క్రేజీ యాక్టర్ ను గుర్తు పట్టలేకపోయిన ప్రభాస్..