సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర ప్రధాని మోడీ నివాళులర్పించారు. గుజరాత్‌లోని నర్మద జిల్లాలోని ఏక్తా నగర్ సమీపంలో ఉన్న 182 మీటర్ల ఎత్తైన ఐక్యతా విగ్రహం దగ్గరకు ఉదయం 8 గంటలకు ప్రధాని మోడీ చేరుకున్నారు.
బీహార్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు విరామం లేకుండా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
అగ్ర రాజ్యం అమెరికాలో ప్రస్తుతం షట్‌డౌన్ నడుస్తోంది. జీతాలు రాక ఉద్యోగులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో బాధ్యతగా మెలగాల్సిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ గాడి తప్పారు.
పెంపుడు జంతువులపై తమిళనాడు రాజధాని చెన్నైలో కొత్త ఆంక్షలు జారీ అయ్యాయి. చెన్నై మహా నగరపాలక సంస్థ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క, పిల్లి పెంచడానికి లైసెన్స్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ధార్ జిల్లాలోని పితంపూర్‌లో రైల్వే వంతెన నిర్మాణ పనుల్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా భారీ క్రేన్ బోల్తా పడింది.
మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టరీత్యా నేరం. నడిపినా.. ప్రోత్సహించినా నేరమే. నిత్యం పోలీసులు హెచ్చరికలు చేస్తుంటారు. అయినా కూడా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. మైనర్లు వాహనాలు నడిపి ఎంత మంది ప్రాణాలు తీశారో అందరికీ తెలిసిందే.
బీహార్‌లో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. సమయం దగ్గర పడడంతో నాయకులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఇక అధికార-విపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ.. మోడీ లక్ష్యంగా విమర్శలు చేయగా.. ఈరోజు ప్రధాని మోడీ.. విపక్ష కూటమి టార్గెట్‌గా ధ్వజమెత్తారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు సృష్టించడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో శరద్‌పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ముంబైలో నకిలీ అణు శాస్త్రవేత్త అలెగ్జాండర్ పామర్ అలియాస్ అక్తర్ కుతుబుద్దీన్ హుస్సేనిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం వెర్సోవాలో అరెస్ట్ చేశారు. వివిధ పేర్లతో శాస్త్రవేత్తగా చెలామణి అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతడి దగ్గర అణు డేటా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
దక్షిణ కొరియా వేదికగా ట్రంప్-జిన్‌పింగ్ సమావేశం సత్ఫలితాన్ని ఇచ్చింది. వాణిజ్య యుద్ధం చల్లారింది. రెండు గంటల సుదీర్ఘ సమావేశం తర్వాత ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం చైనాపై 57 శాతం సుంకం అమలవుతోంది. ట్రంప్ ప్రకటనతో 47 శాతానికి దిగొచ్చింది.