అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం ఆసియా పర్యటనలో ఉన్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా, జపాన్‌లో పర్యటించారు. ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొగుడుతున్నారో.. తిడుతున్నారో తెలియకుండా చాలా నర్మగర్భంగా ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాకిస్థాన్ యుద్ధం సందర్భంగా మోడీతో ట్రంప్ జరిగించిన సంభాషణను గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Droupadi Murmu: ఆపరేషన్ సిందూర్‌లో ఉపయోగించిన యుద్ధ విమానంలో రాష్ట్రపతి గగన విహారం
త్వరలో భారతదేశంతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ అంటే గొప్ప గౌరవం.. ప్రేమ ఉందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గొప్ప సంబంధం కూడా ఉందన్నారు. అలాగే పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా గొప్ప వ్యక్తి అని.. షరీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ కూడా ఉన్నారని.. అతడు ఫీల్డ్ మార్షల్ ఎందుకయ్యాడో తెలుసా? అతడు గొప్ప పోరాట యోధుడు అని కొనియాడారు. వీళ్లందరూ తనకు బాగా తెలుసు అన్నారు. యుద్ధ సమయంలో ఏడు విమానాలు కూలిపోయినట్లు విన్నానని.. రెండు అణ్వస్త్ర దేశాలని.. ఆ సమయంలో నిజంగా దాని కోసం ప్రయత్నించారని తెలిపారు.
ఇది కూడా చదవండి: Khawaja Asif: ‘కాబూల్.. ఢిల్లీ చేతిలో కీలుబొమ్మ’.. పాక్ మంత్రి ఆసిఫ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
‘‘ఆ సమయంలో ప్రధాని మోడీకి ఫోన్ చేశాను. ఇలాగైతే మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోలేమని చెప్పాను. లేదు.. లేదు చేసుకోవాలని మోడీ అడిగారు. పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తే చేయబోనని చెప్పేశాను. అనంతరం పాకిస్థాన్ ప్రధానికి కూడా ఫోన్ చేసి మీరు భారతదేశంతో యుద్ధం చేస్తే వాణిజ్య ఒప్పందం చేసుకోబోనని అన్నాను. మమ్మల్ని పోరాడనివ్వండి అని అడిగారు. ఇలా రెండు దేశాల నేతలు అలాగే అన్నారని.. ఇద్దరూ బలమైన వ్యక్తులు.’’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Cloud Seeding: ఢిల్లీలో మేఘ మథనం ఫెయిల్.. కోట్లు కుమ్మరించినా పడని వాన చుక్క
‘‘ప్రధాని మోడీ చాలా అందంగా కనిపించే వ్యక్తి అని.. కానీ అతడు హంతకుడు.. చాలా కఠినుడు. మేము పోరాడతాం అన్నారు. ఓహ్.. ఇతను మనకు తెలిసిన వ్యక్తేనా అని అడిగాను. అక్షరాలా రెండు రోజుల తర్వాత వారే ఫోన్ చేసి మేము అర్థం చేసుకున్నామని మోడీ అన్నారు. రెండు రోజుల తర్వాత యుద్ధం మానేశారని.. ఎలా ఉంది.. అద్భుతంగా లేదా? బైడెన్ ఎప్పుడైనా ఇలా చేశాడా? అలా చేశాడని నేను అనుకోను.’’ అంటూ ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన ఎపిసోడ్‌ను గుర్తుచేసుకుంటూ ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
#WATCH | US President Donald Trump says, "I'm doing a trade deal with India, and I have great respect and love for Prime Minister Modi. We have a great relationship. Likewise, the Prime Minister of Pakistan is a great guy. They have a Field Marshal. You know why he's a Field… pic.twitter.com/ZbxkpSnBl1
— ANI (@ANI) October 29, 2025
'Father, killer, tough as hell': Trump calls PM Modi "nicest-looking guy", hints at early trade deal, repeats claims on India-Pak mediation
Read @ANI Story | https://t.co/C5wncdkEXY#DonaldTrump #PMModi #indiapakistantensions pic.twitter.com/cMEgYwJzRs
— ANI Digital (@ani_digital) October 29, 2025