TMC manifesto: సీఏఏ, ఎన్‌ఆర్సీ రద్దుతో పాటు 10 వాగ్దానాలు.. ఏవేవంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జోరు సాగుతోంది. ఏడు విడతల్లో పోలింగ్ జరగుతుండగా.. తొలి విడత శుక్రవారమే ప్రారంభంకానుంది. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పోలింగ్‌కి రెండు రోజుల ముందు మేనిఫెస్టోను ప్రకటించారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, యూనిఫాం సివిల్ కోడ్ రద్దుతో పాటు 10 కీలక వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టోను బుధవారం తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసింది. పశ్చిమబెంగాల్‌లో తొలి దశలో కూచ్‌బెర్, అలిపుర్‌దౌర్, జలపాయ్‌గురిలో పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: Govt Jobs 2024 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే?
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్‌సీ), ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) పశ్చిమబెంగాల్‌లో అమలు చేసేది లేదని మేనిఫెస్టోలో తృణమూల్ కాంగ్రెస్ స్పష్టంచేసింది. ఇండియా కూటమిలో భాగంగా కేంద్రంలో టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తామని తెలిపింది. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని వెల్లడించింది. ఉద్యోగాలకు భరోసా, యూనివర్శల్ హౌసింగ్, ఉచిత ఎల్‌పీజీ సిలెండర్లు వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ఇది కూడా చదవండి: Bellamkonda: షైన్ స్క్రీన్స్ తో బెల్లంబాబు కొత్త సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది!
2024 లోక్‌సభ ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేయడం ఆనందంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎక్స్ ట్విట్టర్ ట్వీట్ చేసింది. ప్రతి భారతీయునికి ఉపాధి హామీ, సార్వత్రిక గృహాలు, ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు, రైతులకు హామీ ఇవ్వబడిన MSP, SC, STలకు స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపింది. బీజేపీ జమీందార్లను పడగొట్టి అందరికీ గౌరవప్రదమైన జీవితానికి మార్గం సుగమం చేస్తామని టీఎంసీ వెల్లడించింది.
తృణమూల్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న 10 వాగ్దానాలివే..
రూ.400 రోజువారీ వేతనంతో జాబ్ కార్డ్ హోల్డర్‌లకు 100 రోజుల పని హామీ
బీపీఎల్ కుటుంబాలకు సంవత్సరానికి 10 గ్యాస్ సిలిండర్లు ఉచితం
పేద కుటుంబాలకు ఉచిత ఇళ్లు
రేషన్ కార్డ్ హోల్డర్లందరికీ ఫ్రీ రేషన్ డెలివరీ
SC/STల ఉన్నత విద్య కోసం నెలకు రూ.1,000 స్కాలర్‌షిప్
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు
పెట్రో ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధి
25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా హోల్డర్లకు అప్రెంటిస్‌షిప్
CAA, NRC రద్దు, దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ ఉండదు
దేశవ్యాప్తంగా బాలికలకు కన్యాశ్రీ వంటి సంక్షేమ పథకాలు
We are delighted to present our Manifesto for the Lok Sabha Elections, 2024!
With #DidirShopoth, we pledge to uplift every Indian with guaranteed employment, universal housing, free LPG cylinders, assured MSP for farmers, scholarships for SC, ST, OBC students and much more.… pic.twitter.com/aEvgw7inr4
— All India Trinamool Congress (@AITCofficial) April 17, 2024
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్‌డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!