Delhi: ఢిల్లీలో దారుణం.. కత్తిపోట్లకు ఒకరి మృతి.. మరో ఇద్దరికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. త్రిలోక్‌పురిలో పలువురు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కత్తిపోట్లకు గురైన ఓ యువకుడు మృతి చెందాడు. లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మరో ఇద్దరు కూడా ఆ ప్రాంతంలో కత్తిపోట్లకు గురైనట్లు సమాచారం. వారిని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కత్తిపోట్లకు గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆస్పత్రి దగ్గర బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
లాల్ బహదూర్ శాస్త్రి హాస్పిటల్ నుంచి తమకు సమాచారం అందిందని తూర్పు ఢిల్లీ డీసీపీ అపూర్వ గుప్తా తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడారు. కత్తిపోట్లలో గాయపడిన వ్యక్తి మరణించాడని చెప్పారు. మధ్యాహ్నం కూడా ఇద్దరు వ్యక్తులు కూడా ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
#WAṬCH | DCP East Delhi, Apoorva Gupta says, "We received information from Lal Bahadur Shastri Hospital that an injured man was admitted here and he succumbed to his injuries. We are verifying the facts and gathering more information. Two more people were admitted here in the… https://t.co/BPh0Hp9iRD pic.twitter.com/aS7AzXW3wR
— ANI (@ANI) April 17, 2024
#WATCH | Delhi: A youth died after allegedly being stabbed in Trilokpuri. He was admitted to Lal Bahadur Shastri Hospital where he succumbed to his injuries. Two others also were reportedly stabbed in the area.
Visuals from outside the hospital. pic.twitter.com/DhPvVRS8VS
— ANI (@ANI) April 17, 2024
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..