గత కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు భగభగమండిపోతున్నాడు. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. రెండు, మూడ్రోజులుగా వేడి తీవ్రత తగ్గినా.. శనివారం మాత్రం మరోసారి తీవ్ర ప్రభావం చూపించింది. తాజాగా వాతావరణ శాఖ మరో అప్‌డేట్ ఇచ్చింది. పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. మే 11 నుంచి 15 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉండడం విశేషం. సోమవారమే, అనగా మే 13న తెలుగు స్టేట్స్‌తో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ కనీసం 50 సీట్లను కూడా గెలుచుకోలేదు..ప్రతిపక్ష హోదా రాదు..
జమ్మూకాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, గోవా, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మే 11-15 వరకు కేరళ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖాండ్‌లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Paul Stirling: పాక్ జట్టును ఘోరంగా అవమానించిన ఐర్లాండ్ కెప్టెన్.. అసలు మ్యాటరెంటంటే..
తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, మరాఠ్వాడా ప్రాంతాలలో వడగళ్ల వానలు వీచే అవకాశం ఉంది. ఇక 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని తెలిపింది. ఉత్తరాఖండ్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Vijayasai Reddy: నెల్లూరు రాజకీయాలను వీళ్లు నీచ స్థాయికి తీసుకువచ్చారు.. విజయసాయి రెడ్డి ఫైర్