పశ్చిమ బెంగాల్‌లో రాజ్‌భవన్-ప్రభుత్వం మధ్య రగడ రాజుకుంటోంది. గవర్నర్-ముఖ్యమంత్రి మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా సీఎం మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గవర్నర్ సీవీ. ఆనంద బోస్ గవర్నర్‌గా కొనసాగే వరకు రాజ్‌భవన్‌లోకి అడుగు పెట్టనని ఆమె తేల్చిచెప్పారు. గవర్నర్ దాదాగిరి ఇక చెల్లదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Tribute To Sridevi: Tribute To Sridevi: ఇది కదా శ్రీదేవికి సిసలైన నివాళి
ఆనంద బోస్ రాజ్‌భవన్‌లో ఓ కాంట్రాక్టు మహిళా ఉద్యోగిని వేధించినట్లు గత వారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎందుకు రాజీనామా చేయలేదో బోస్ చెప్పాలని డిమాండ్ చేశారు. హుగ్లీ అభ్యర్థి రచనా బెనర్జీకి మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడారు.. బోస్ గవర్నర్‌గా కొనసాగే వరకు రాజ్‌భవన్‌లోకి అడుగు పెట్టనని కూడా ఆమె తేల్చిచెప్పారు. గవర్నర్ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత రాజ్‌భవన్‌లోని పలు సీసీటీవీ ఫుటేజీలను పరీక్షించారు. అవన్నీ గవర్నర్ ఎడిట్ చేసిన వీడియోను విడుదల చేశారని, తాను మొత్తం ఫుటేజీని చూశానన్నారు. అవన్నీ షాకింగ్‌గా ఉన్నాయని అన్నారు. గవర్నర్ ప్రవర్తన సిగ్గుచేటు అని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Court Shocked To School: ముఖాలు నల్లగా ఉన్నాయంటూ విద్యార్థులను బహిష్కరణ చేసిన స్కూలు యాజమాన్యం..