ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో పాటు పెద్ద ఎత్తున మంచు కూడా కురుస్తుంది. దీంతో చార్‌ధామ్ యాత్రకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే బద్రీనాథ్‌లో కూడా వాతావరణం అనుకూలంగా లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చార్‌ధామ్ యాత్ర కోసం ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.
ఇది కూడా చదవండి: Pakistan: PIA ఎయిర్‌లైన్ నిర్లక్ష్యం.. చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
అకస్మాత్తుగా వాతావరణం మారడంతో సాహస యాత్రలో ఉన్న భక్తులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లతో పాటు చార్ ధామ్ యాత్ర యొక్క పుణ్యక్షేత్రాలలో ఒకటైన గంగోత్రి ఆలయంతో సహా గంగా లోయలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక యమునోత్రికి కొండ మార్గంలో పెద్ద సంఖ్యలో భక్తులు గంటల తరబడి క్యూలలో చిక్కుకున్నారు. అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడమే కారణంగా భక్తులు ఆరోపిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Allu Arjun: నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ కి పోలీసుల షాక్.. కేసు నమోదు?
చార్ ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి, కేదార్‌నాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు భక్తుల కోసం తెరవబడ్డాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు యమునోత్రి, కేదార్‌నాథ్ తలుపులు తెరవగా, వేలాది మంది భక్తుల సమక్షంలో గంగోత్రి ఆలయ తలుపులు మధ్యాహ్నం 12.25 గంటలకు తెరుచుకున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నుంచి అక్టోబర్-నవంబర్ వరకు లక్షలాది మంది భక్తులు యాత్రకు వస్తారు.
ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: యూసీసీ అమలు, పీఓకే కోసం ఏన్డీయే 400 సీట్లు గెలవాలి..