ఉత్తరప్రదేశ్‌లో జరిగిన తొక్కిసలాట 121 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు చలించిపోయాయి. ఇప్పటికే ఈ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారు.
భువనేశ్వర్‌లో దారుణం జరిగింది. కన్నతల్లి ఎదుటే తండ్రిని హతమార్చాడు కొడుకు. ఆర్థిక తగాదాలే హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనిరుధా చౌదరిని అరెస్ట్ చేశారు.
ఇండోనేసియాలో దారుణం జరిగింది. ఓ కొండచిలువ మహిళను చంపేసింది. ఈ దారుణ ఘటన జూలై 2న చోటుచేసుకుంది. భర్త రక్షించే ప్రయత్నం చేసినప్పటికే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
పెట్రోల్ బంక్ అంటేనే ఎన్నో జాగ్రత్తలు.. భద్రతా ప్రమాణాలు ఉంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ విపత్తే జరగొచ్చు. అంతటి భయంకరమైన పరిస్థితులుంటాయి. అలాంటి చోట ఓ యువకుడు రెచ్చిపోయాడు
జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు. జనవరి 31న అప్పటి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలపై కర్ణాటక ప్రభుత్వం మండిపడింది. దీనికి వ్యతిరేకంగా గురువారం కర్ణాటక కేబినెట్ సమావేశం కానుంది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లును ఆమోదించాలని యోచిస్తోంది.
వందే భారత్ రైలుకు సంబంధించిన వార్త తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ట్రైన్ పైకప్పు నుంచి వర్షపునీరు ధారలా కారిపోతుంది. దీంతో ప్రయాణికులు సీట్లో కూర్చోలేని దుస్థితి ఏర్పడింది. భారీగా నగదు చెల్లించి టికెట్ తీసుకుని.. సీట్లో కూర్చునే అవకాశం లేకుండా పోయింది.
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌కు లోక్‌సభ స్పీకర్ శుభవార్త చెప్పారు. జూలై 5న (శుక్రవారం) ఎంపీగా అమృతపాల్ ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతి ఇచ్చారు.
ఓ నాగుపాము ఇంటి పెరటిలోకి హల్చల్ చేసింది. ఇంటి ఆవరణలో కలియ తిరుగుతుండగా ఓ పెద్ద దగ్గు సిరప్ బాటిల్ కనిపించింది. దాన్ని ఏమనుకుందో.. ఏమో తెలియదు గానీ అమాంతంగా మింగేసింది. అది కాస్త లోపలికి వెళ్లక.. బయటకు రాక స్నేక్ విలవిలలాడింది.