Rajasthan: పెట్రోల్ బంక్‌లో యువకుడు ఓవరాక్షన్.. డీజిల్ నేలపాలు.. చివరికిలా..!
- పెట్రోల్ బంక్‌లో యువకుడు ఓవరాక్షన్
- డీజిల్ నేలపాలు.. వీడియో వైరల్
- ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్ బంక్ అంటేనే ఎన్నో జాగ్రత్తలు.. భద్రతా ప్రమాణాలు ఉంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ విపత్తే జరగొచ్చు. అంతటి భయంకరమైన పరిస్థితులుంటాయి. అలాంటి చోట ఓ యువకుడు రెచ్చిపోయాడు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసమో.. లేదంటే ఓవరాక్షన్ తెలియదు గానీ.. డీజిల్ మిషన్ పైపు తీసుకుని కారులో పోస్తుండగా.. ట్యాంక్ నిండిపోయి.. బయటకు వేస్ట్‌గా పోయేలా చేశాడు. అంతేకాకుండా ఈ సీన్లు వీడియోలో పడేలా ఫోజులిచ్చాడు. అలాగే మీసం తిప్పాడు. బంక్ సిబ్బంది ఏ మాత్రం అభ్యంతరం తెల్పలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇది కూడా చదవండి: Shalini : ఆస్పత్రిలో హీరో అజిత్ భార్య.. ఏమైందంటే..?
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
రీల్స్ కోసం యువత చేస్తున్న చేష్టలు ప్రమాదాలు కొనితెచ్చేలా ఉంటున్నాయి. రాజస్థాన్‌లోని ఒక పెట్రోల్ బంకులో ఒక వ్యక్తి తన కారులోకి ఇంధన ట్యాంక్‌ను ఓవర్‌ఫిల్ చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. డీజిల్ ట్యాంక్‌ను పెట్రోల్ బంకులో నింపుతున్నప్పుడు మరొక వ్యక్తి అతనిని గమనిస్తున్నాడు. డీజిల్ కూడా నేలపై పడిపోవడం కనిపించింది. అనంతరం కారు సన్‌రూఫ్‌లో నుంచి వ్యక్తి నిలబడి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. 22 సెకన్ల క్లిప్ ముగిసే సమయానికి ఇద్దరు వ్యక్తులు పానీయాలు తాగుతూ కనిపించారు.
ఇది కూడా చదవండి: Nivetha Thomas: నాకు పెళ్లయింది.. నా భర్త, పిల్లలు వీళ్ళే.. నివేదా థామస్ షాకింగ్ కామెంట్స్ !
ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. జూలై 2న అజ్మీర్ పోలీసులు గమనించారు. మోటారు వాహనాల చట్టం కింద వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వల్ల పెను విపత్తు సంభవించి ఉండేదని తెలిపారు. వీడియోలో ఉన్న ఫతే సింగ్, మహావీర్ గుజ్జర్‌లను అరెస్టు చేశారు. అలాగే పెట్రోల్ బంకు ఉద్యోగిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదైనా జరిగితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని పేర్కొన్నారు.
https://twitter.com/Up_Moradabad/status/1808467113905905774
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!