Deputy CM Pawan Kalyan: నేటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ కమిటీల నియామక ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. కార్యకర్తల నుంచే నాయకత్వాన్ని తీర్చిదిద్దాలన్న జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సూచనల మేరకు.. మూడు రోజుల పాటు ఈ కమిటీల నియామకం జరగనుంది. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు కార్యాలయానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి చేరుకున్నారు. వార్డు, బూత్, గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటు చేసే కసరత్తు ప్రారంభమైంది. ప్రతి వార్డులో 10 నుంచి 15 మంది సభ్యులతో వార్డు ఇంచార్జీలను ఎంపిక చేయనున్నారు. అదే విధంగా బూత్, గ్రామ స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న జనసైనికులు, వీరమహిళలకు గుర్తింపు కల్పించేలా ఈ కమిటీల నియామకం జరగనుంది.. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో 100 శాతం స్టైక్ రేట్ సాధించిన తర్వాత ఓ వైపు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతూనే.. మరోవైపు.. పార్టీ నిర్మాణంపై కూడా ఫోకస్ పెట్టారు పవన్ కల్యాణ్.. ఆ దిశగానే అన్ని కమిటీలను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే..
Read Also: Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు