అక్రమాస్తుల కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు బెయిల్ లభించింది. అల్ ఖదీర్ యూనివర్శిటీకి ఆర్థిక సహాయానికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి రావల్పిండి అకౌంటబిలిటీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
దక్షిణ గాజా నగరమైన ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో కనీసం తొమ్మిది మంది మరణించారు. పాలస్తీనా ఆరోగ్య అధికారులు మంగళవారం తెలియజేశారు. ఒక రోజులోపు నగరంలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించింది.
నైజీరియాలో మహిళా ఆత్మాహుతి బాంబర్లు బీభత్సం సృష్టించారు. పెళ్లి, అంత్యక్రియలు, ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య నైజీరియా పట్టణంలోని గ్వోజాలో వారాంతంలో జరిగిన పలు ఆత్మాహుతి బాంబు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32కి చేరిందని, 42 మంది గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు కాశీం శెట్టిమా సోమవారం తెలిపారు.
ప్రపంచ కుబేరుడు ముకేష్ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలంటే మామూలుగా ఉంటాయి. అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. మార్చి 1 నుంచి 3 వరకు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటనను ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు.
గత నెలలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ ప్రైడ్ ఈవెంట్లో మహిళపై మిలియనీర్ బ్యాంకర్ జోనాథన్ కేయ్ దాడికి తెగబడ్డాడు. పిడిగుద్దుల వర్షం కురిపించడంతో ఆమె నేలపై పడిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పరిచయం ఉన్న బాలిక మాట్లాడేందుకు నిరాకరించిందని యువకుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నగరంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. 1,275 గ్రామాలపై వరద ప్రభావం చూపించింది. దీంతో 6.4 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇక బాధితులకు 72 సహాయ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.