ముంబై వేదికగా ముఖేష్ అంబానీ ఇంట చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి రోజూ ఆయా కార్యక్రమాలతో సంబరాలు జరుగుతున్నాయి. ఇక మంగళవారం జరిగిన హల్దీ వేడుక అంబారాన్నింటాయి. ఇందుకోసం పెళ్లి కూతురు రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హల్దీ వేడుక కోసం రాధిక మర్చంట్ పూల దుపట్టా ధరించి.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా అలరించింది.
ఇది కూడా చదవండి:Iran: మెకానిక్‌ని లోపలికి లాక్కున్న విమానం ఇంజన్.. ఏం జరిగిందంటే..
అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్ తాజా పూల ‘తగర్ జాల్ దుపట్టా’ ధరించింది. పూల దుపట్టా 90 మేరిగోల్డ్ పువ్వులు, వేలాది టాగర్ కలీలతో తయారు చేశారు. రాధిక డిజైనర్ అనామికా ఖన్నా తయారు చేసింది. అలాగే టాసెల్ స్ట్రింగ్‌లతో కూడిన చెవిపోగులు, డబుల్ నెక్లెస్, హాత్ ఫూల్, కలీరాస్‌తో సహా పూల ఉపకరణాలతో రూపాన్ని తయారు చేసింది.
ఇది కూడా చదవండి: AP Crime: కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య.. అసలు విషయం తెలిస్తే షాకే..
రాధిక తాజా చిత్రాలను రియా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ హల్దీ వేడుకలో సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, అలియా భట్, సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, వేదంగ్ రైనా, మానుషి చిల్లర్, బోనీ కపూర్, ఉదిత్ నారాయణ్, రాహుల్ వైద్య, అర్జున్ కపూర్, ఇతరులు పాల్గొన్నారు.