ఆ తండ్రి, కొడుకులకు ఏం కష్టమొచ్చిందో ఏమో తెలియదు గానీ.. ఉన్నట్టుండి ట్రైన్ కిందపడి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘోర విషాదం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైల్వేస్టేషన్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
మహారాష్ట్రలోని ముంబైకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న భయందర్ రైల్వే స్టేషన్‌లో తండ్రి, కొడుకులిద్దరూ ఫ్లాట్ ఫామ్‌పై నడుచుకుంటూ ట్రాక్‌పైకి దిగారు. ఇంతలో లోకల్ ట్రైన్ దూసుకొస్తోంది. ఏమైందో.. ఏమో తెలియదు.. పట్టాలపై తలకాయలు పెట్టడంతో రైలు వారిపైకి ఎక్కడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
చేతులు పట్టుకుని ఇద్దరూ ట్రాక్‌లను దాటడం.. రైలు వారి దగ్గరికి వస్తున్నప్పుడు రైలు పట్టాలపై పడుకోవడం కనిపిస్తుంది. కొన్ని సెకన్ల తర్వాత రైలు వారి మీద నుంచి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు పాల్ఘర్ జిల్లాలోని భయాందర్ స్టేషన్ నుంచి లోకల్ రైలు బయలుదేరిన తర్వాత భయేందర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ నంబర్ 6 దగ్గరకు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. రైలు.. విరార్ నుంచి చర్చిగేట్‌కు వెళ్తోంది.
బాధితులు నలసోపరా నివాసి జే మెహతా (35), అతని తండ్రి హరీష్ మెహతా (60)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Tragic and heart-wrenching scene as a father and son commit suicide by lying on the tracks in front of an approaching train near Bhayandar station.#LokmatTimes #Suicide #CCTVFootage #TrainIncident #RailwaySafety #MumbaiNews pic.twitter.com/yuuhdbk2DW
— Lokmat Times (@lokmattimeseng) July 9, 2024