ఢిల్లీలో ప్రధాని మోడీని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చించారు. అనంతరం శివకుమార్ మీడియాతో మాట్లాడారు.
కేరళ విలయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో స్పందించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడగానికి వారం రోజుల ముందే కేరళలోని పినరయ విజయన్ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు అమిత్ షా స్పష్టం చేశారు.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (34)కు యూపీఎస్సీ భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్‌లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన సూచీలు.. చివరిదాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 285 పాయింట్లు లాభపడి 81,741 దగ్గర ముగియగా.. నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి 24, 951 దగ్గర ముగిసింది.
బీహార్‌లో దారుణం జరిగింది. నర్సరీ విద్యార్థి స్కూల్లో తుపాకీతో హల్చల్ చేశాడు. ఓ విద్యార్థిపై కాల్పులకు తెగబడ్డాడు. చేతికి బుల్లెట్ తగలడంతో హుటాహుటినా పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో స్కూల్ యాజమాన్యంతో షాక్‌కు గురైంది. సుపాల్ జిల్లాలోని సెయింట్ జోన్ బోర్డింగ్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆగస్టు 2, 3 తేదీల్లో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి ఉపరాష్ట్రపతి జగదీప్ దంకర్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు.
మయన్మార్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్ మో స నే సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి మరణించింది. 14 ఏళ్ల బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య చిక్కుకుపోయి ప్రాణాలు వదిలింది. తనను తాను రక్షించుకొనే ప్రయత్నం చేసినా చివరికి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో సొంతం చేసుకుంది. జూలై 28న జైపూర్‌లోని క్లార్క్స్ అమెర్‌లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్లో ఆమెకు పట్టాభిషేకం జరిగింది. అద్భుతమైన పోటీల కెరీర్లో ఫుర్టాడోకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది.
చేతులు కాలాక.. ఆకులు పట్టుకోవడమంటే ఇదేనేమో.. విపత్తు జరిగితేనే తప్ప అధికారులు మొద్ద నిద్ర వీడరేమో. ఇటీవల ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి ఓ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి నీళ్లు ప్రవేశించి లైబ్రరీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జలసమాధి అయిపోయారు.
కేరళలోని వయనాడ్‌ను కనీవినీ ఎరుగని రీతిలో భారీ విలయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ గాఢనిద్రలో ఉండగా మధ్య రాత్రిలో ఒక్కసారిగా కొండచరియలు విరుచుకుపడడంతో గ్రామాలు.. గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి.