చైనాలో భారత్ ఇన్‌ఫ్లుయెనర్స్ ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆమె చర్యను జాత్యహంకారంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. అసలు ఇంతకీ ఏమైంది? ఆమెపై మండిపడడానికి గల కారణమేంటో ఈ వార్త చదవండి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో కీలక బిల్లు ఆమోదించింది. ‘లవ్ జిహాద్’ బిల్లుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై దోషులకు యావజ్జీవం శిక్ష పడే అవకాశం ఉంటుంది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఇతరులపై దాఖలు చేసిన సీబీఐ చార్జిషీట్‌ను ఆగస్టు 12న ఢిల్లీ కోర్టు పరిశీలించాలని నిర్ణయించింది.
చెన్నైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారు. శ్రీలంకకు అక్రమంగా తరలిస్తుండగా రూ.70 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఢిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడమే కాకుండా.. తప్పుడు పత్రాలతో ఉద్యోగం పొందినట్లుగా ఆరోపణలు రావడంతో ఆమెపై యూపీఎస్సీ యాక్షన్ తీసుకుంది.
సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు విడాకులు మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కునాల్ కపూర్ భార్య ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది
ప్రమాదాలను అరికట్టేందుకు కేరళ రాష్ట్రం సరికొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై బైక్ ప్రయాణంలో వెనుక సీట్లో కూర్చొని ఉన్న వ్యక్తితో మాట్లాడినా నేరంగా పరిగణించాలని కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది.
పెళ్లి అనేది జీవితంలో ఒకసారే చేసుకునేది. దీన్ని ఎంతో గ్రాండ్‌గా.. గుర్తుండిపోయేలా ఒక వేడుకగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రపంచమంతా చెప్పుకునేలా అంగరంగ వైభవంగా చేశారు.