శివసేన నేత (యూబీటీ) రఘునాథ్ మోరే కుమారుడు మిలింద్ మోర్ గుండెపోటుతో మృతి చెందారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఆటోరిక్షా డ్రైవర్‌తో గొడవ తర్వాత గుండెపోటుతో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
అగ్నిపథ్‌పై లోక్‌సభలో రాహుల్ గాంధీ వర్సెస్ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య వాడీవేడీ చర్చకు దారి తీసింది. అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్ష నేత తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రాజ్‌నాథ్ ఆరోపిస్తూ.. ఈ అంశంపై సభలో చర్చిస్తామన్నారు.
టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. వేదికపై ఓ చిన్నారిని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి భారీ ఊరట లభించింది. భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను ఎత్తేసింది.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు నెలలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 5 నుంచి 10 వరకు రాష్ట్రపతి ఆయా దేశాలను సందర్శించనున్నారు. ఆగస్టు 5-10 మధ్య ఫిజీ, న్యూజిలాండ్, తైమూర్-లెస్టేలో ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు.
సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో ఆమెకు ఉపశమనం లభించింది. 5 నెలల జైలు శిక్షను న్యాయస్థానం సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూలంగా ఉండడంతో ఉదయం సరికొత్త రికార్డులు నమోదు చేసిన సూచీలు... అనంతరం నష్టాల్లో ట్రేడ్ అవుతూ ఫ్లాట్‌గా ముగిశాయి.
శాసనసభలో తప్పుడు ప్రకటనలతో అసెంబ్లీని కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ సోమవారం విచారణ జరిపారు.
గ్రామ స్వరాజ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ఇక పచ్చని పల్లెలు ప్రగతికి మెట్లు అని పెద్దలు అంటుంటారు. అంతేకాదు.. కేంద్రం ప్రభుత్వం వికసిత్ భారత్ కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థికంగాను దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ అభివృద్ధిలో మాత్రం ఇంకా మార్పు కనిపించడం లేదు.