Wayanad landslides: వయనాడ్ విలయంపై శాస్త్రవేత్తల అనుమానాలివే..!
- వయనాడ్ విలయంపై శాస్త్రవేత్తల కొత్త అనుమానాలు
- అరేబియా సముద్రం వేడెక్కడమే కారణమని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని వయనాడ్‌ను కనీవినీ ఎరుగని రీతిలో భారీ విలయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ గాఢనిద్రలో ఉండగా మధ్య రాత్రిలో ఒక్కసారిగా కొండచరియలు విరుచుకుపడడంతో గ్రామాలు.. గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పటికే వంద మంది మృతదేహాలను వెలికితీయగా.. మరికొందరు శిథిలాల్లో చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా వందలాది మంది గాయాలు పాలయ్యారు. ఈ ఘోరం.. కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద స్థాయిలో విపత్తు సంభవించడంపై వాతావరణశాఖ నిపుణులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అయితే ఈ విపత్తుకు అరేబియా సముద్రం వేడెక్కడమే కారణంగా భావిస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం కారణంగానే వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయని వాతావరణ శాస్త్రవేత్త చెప్పారు. అరేబియా సముద్రం వేడెక్కడం కారణంగా డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ఏర్పడి.. తక్కువ వ్యవధిలో కేరళలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని.. దీంతో కొండచరియలు విరిగిపడతాయని సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త మంగళవారం తెలిపారు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
చురుకైన రుతుపవనాల కారణంగా ఆఫ్‌షోర్ ద్రోణి ప్రభావంతో కాసర్‌గోడ్, కన్నూర్, వాయనాడ్, కాలికట్, మలప్పురం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ తెలిపారు. గత రెండు వారాలుగా కొంకణ్ ప్రాంతం తేమగా ఉంది. అరేబియా సముద్రంలో సోమవారం మేసోస్కేల్ క్లౌడ్ వ్యవస్థ ఏర్పడింది. దీని కారణంగా వాయనాడ్, కాలికట్, మలప్పురం, కన్నూర్‌లలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని.. ఫలితంగా స్థానికంగా కొండచరియలు విరిగిపడ్డాయని ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అభిలాష్ చెప్పారు. అంతేకాకుండా మరో రెండు రోజులు ఇలానే ఉంటుందని తెలిపారు.
మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వాయనాడ్ జిల్లాలోని కొండ ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 100 మంది మరణించారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..