నీట్ పేపర్ లీకేజీ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. 13 మంది నిందితులపై చార్జ్‌షీటు దాఖలు చేసింది. నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
దేశ వ్యాప్తంగా ఇటీవల రైల్వే ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైల్వే ప్రయాణాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
కేరళ విలయం తన దృష్టిలో జాతీయ విపత్తు అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి రాహుల్ వయనాడ్ ప్రకృతి విపత్తు జరిగిన ప్రాంతాలను సందర్శించారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై యువతిని ఎనిమిది సార్లు కత్తితో పొడిచాడు. రక్తమోడుతూ విలవిలలాడుతుంటే.. మొబైల్లో షూట్ చేస్తున్నారే తప్ప.. ఎవరు ముందుకొచ్చి రక్షించిన పాపాన పోలేదు.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. తక్షణమే లెబనాన్‌ను ఖాళీ చేయాలని భారతీయ పౌరులకు కేంద్రం సూచించింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉంది
ఉత్తర కొరియాను భారీ వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున పొలాలు, ఇళ్లు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు
కొత్త పార్లమెంట్లో వాటర్ లీకేజీపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్‌ను ఇటీవలే ప్రధాని మోడీ ప్రారంభించారు.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు మరో చుక్కెదురైంది. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బుధవారమే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ తిరస్కరించిన కొన్ని గంట్లోనే న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.
చాక్లెట్ అంటే పిల్లల దగ్గర నుంచి అన్ని వయసుల వారు ఇష్టపడని వాళ్లు ఉండరు. అది కనిపిస్తే చాలు.. లాలాజలం ఊరిపోతుంది. అంతగా ఇష్టపడేవాళ్లుంటారు. కనీసం రోజుకు ఒకటైనా తినకుండా ఉండరు. అంతగా ఇష్టపడి తినే చాక్లెట్ గురించి తాజాగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ షాకింగ్ న్యూస్ తెలియాలంటే ఈ వార్త చదవండి.