దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గురువారం చరిత్ర సృష్టించాయి. సెన్సెక్స్ 82 వేల మార్కు.. నిఫ్టీ 25 వేల మార్కు దాటాయి. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంకాగాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. గురువారం ఇద్దరు కలిసి ప్రకృతి విలయం సృష్టించిన చూరల్మలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో కలియ తిరిగారు.
ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకి నిలిచింది. నిత్యం ఏదొక వార్తల్లో ఉంటూనే ఉంటుంది. డ్యాన్స్ రీల్స్, వికారమైన డ్రెస్సింగ్.. అనేకమైన వీడియోలు ఆన్లైన్లో దర్శనమిస్తుంటాయి
దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షం ముంచెత్తింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం సాయంత్రం హఠాత్తుగా అత్యంత భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి. మరోవైపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో 10 విమానాల రాకపోకలను దారి మళ్లించారు.
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సీటు లభిస్తే.. ఉచితం విద్య లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఇందులో సీటు కోసం తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇందులో సీటు కోసం ఎంపీల సాయంతో లభించేది. అయితే ఈ విధానం కొద్ది రోజులగా బ్రేక్ పడింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. భర్త, పిల్లలతో బైక్‌పై వెళ్తున్న మహిళపై దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. తూటా ఛాతీలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
వయనాడ్ విలయంపై వారం రోజుల క్రితమే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించామంటూ రాజ్యసభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తోసిపుచ్చారు.
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు మొదటి వారంలో పశ్చిమ తీరం వెంబడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇక బుధవారం మిజోరంలో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా గుంపులు.. గుంపులుగా మిడతల దండు బీభత్సం సృష్టించాయి. సేదదీరేందుకు బీచ్‌కు పోతే.. హఠాత్తుగా డ్రాగన్‌ఫ్లై సమూహం ఎటాక్ చేయడంతో పర్యాటకులు హడలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.