మయన్మార్‌కు చెందిన టిక్‌టాక్ స్టార్ మో స నే సెల్ఫీలు తీసుకుంటూ జలపాతంలో పడి మరణించింది. 14 ఏళ్ల బాలిక రెండు పెద్ద బండరాళ్ల మధ్య చిక్కుకుపోయి ప్రాణాలు వదిలింది. తనను తాను రక్షించుకొనే ప్రయత్నం చేసినా చివరికి ప్రవాహంలో కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. రంగంలోకి దిగి అతి కష్టం మీద బాలికను బయటకు తీశారు. తాళ్ల సాయంతో బాలికను పైకి తీసుకొచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఇది కూడా చదవండి: AP CM: సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థికవేత్త భేటీ..!
ఇటీవల ముంబైకి చెందిన ట్రావెల్ డిటెక్టివ్ ఆన్వీ కామ్‌దార్ కూడా మహారాష్ట్రలోని కుంభే జలపాతంలో పడి ప్రాణాలు వదిలింది. ఆయా ప్రాంతాలు తిరుగుతూ టూరిస్టు స్థలాలను పరిచయం చేస్తూ ఉండేది. తన స్నేహితులతో జలపాతాన్ని చూస్తూ.. కాలు జారి బండ సందుల్లో పడి ప్రాణాలు వదిలింది.
ఇది కూడా చదవండి: Miss global india: మిస్ గ్లోబల్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న స్వీజల్