ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడు కీలక రైలు ప్రాజెక్టులు, రెండు కొత్త ఎయిర్ పోర్టుల మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు.
క్రిమినల్ కేసుల్లో బాలనేరస్తులకు బెయిల్ నిరాకరించొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర నేరస్థుడితో నైతిక, శారీరక సంబంధం, మానసికంగా ప్రమాదం ఉందని తేలితే తప్ప.. వారికి బెయిల్ నిరాకరించవద్దని స్పష్టం చేసింది.
జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు స్తంభించనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఒక రోజంతా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నెతన్యాహు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చేశాక... మైనారిటీలు, హిందువులపై దాడులు పెరిగిపోయాయి. దీంతో దాడులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీకి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఫోన్ కాల్ చేశారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఆయా చోట్ల సాయంత్రం 4గంటల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. అంతేకాకుండా సాయంత్రం సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీంతో వాహనదారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు ఇప్పుడు ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ చుట్టూ తిరుగుతోంది. బాధితురాలి తల్లిదండ్రులు.. అతనిపైనే ప్రధానంగా ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఘోష్‌ను వేరేచోటికి ట్రాన్స్ఫర్ చేసినా.. హైకోర్టు మాత్రం సెలవుపై పంపించింది.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన దేశాన్నే కలచివేస్తుందన్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మహిళలపై క్రూరత్వం వంటి ఘటనలు సిగ్గు పడేలా ఉన్నాయని తెలిపారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. పోస్టుమార్టం రిపోర్టు కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. అంత హింసాత్మకంగా వైద్యురాలిపై దాడి జరిగింది. ఇక ఘటనాస్థలిలో బాధితురాలు అర్ధనగ్నంగా పడి ఉండడం.. దేహమంతా గాయాలై.. రక్తసిక్తంగా శవమై పడి ఉంది.