బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ బుధవారం తెలిపారు.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్-లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు కమ్ముకున్నాయి. ఇటీవల హమాస్ అగ్ర నేత హనియా హత్య తర్వాత ఈ పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మొసలి నివాసాల మధ్యకు వచ్చేసింది. దీంతో జనాలు హడలెత్తిపోయారు. మొసలి వెంట కుక్క పడడంతో రోడ్డుపై పరుగులు పెట్టింది. దీంతో స్థానికులు కూడా పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలో ఓ బీజేపీ నేత పోలీస్ స్టేషన్లో వీరంగం సృష్టించాడు. మహిళ అని చూడకుండా విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శివసేన యూబీటీ అధికార ప్రతినిధి సుష్మా అంధారే సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చింది. దీంతో బుధవారం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరి దాకా టాప్ రేంజ్లో ట్రేడ్ అయ్యాయి.
ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్షీటులోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎన్డీఏ, ఇండియా కూటమి పక్షాలు ఎవరికి వారే ఎత్తుగడలు వేస్తు్న్నారు.