కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఘటన దేశాన్నే కలచివేస్తుందన్నారు. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, మహిళలపై క్రూరత్వం వంటి ఘటనలు సిగ్గు పడేలా ఉన్నాయని తెలిపారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అత్యంత క్రూరంగా వైద్యురాలు హత్యాచారానికి గురైంది. పోస్టుమార్టం రిపోర్టు కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. అంత హింసాత్మకంగా వైద్యురాలిపై దాడి జరిగింది. ఇక ఘటనాస్థలిలో బాధితురాలు అర్ధనగ్నంగా పడి ఉండడం.. దేహమంతా గాయాలై.. రక్తసిక్తంగా శవమై పడి ఉంది.
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్‌కు బాగా కలిసొచ్చింది. హిండన్ బర్గ్ ఆరోపణల నేపథ్యంలో ఈ వారం ప్రారంభంలో కొద్దిగా ప్రభావం చూపించినా.. అనంతరం దాని ఎఫెక్ట్ అంతగా కనిపించలేదు.
దేశ వ్యాప్తంగా రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హర్యానా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూలను ఈసీ విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో 90 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం తర్వాత నెమ్మదిగా ఆందోళనలు సాగుతున్న తరుణంలో ఒక్కసారిగా అల్లరిమూకలు.. ఆస్పత్రిలోకి ప్రవేశించి ఆధారాలు చెరిపేందుకు ప్రయత్నించడంతో తాజాగా ఈ ఆందోళనలు మరింత ఉధృతం అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రధాని మోడీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక విజ్ఞప్తి చేశారు. అల్లర్లతో అట్టుడికిన మణిపుర్‌ను సందర్శించి, శాంతియుత పరిష్కారానికి కృషి చేయాలని ప్రధానికి రాహుల్ గాంధీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మణిపూర్ పౌరులతో రాహుల్ భేటీ అయ్యారు.
అగ్ని క్షిపణి పితామహుడు ఆర్ఎన్ అగర్వాల్(84) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో గురువారం ఆయన కన్నుమూశారు. 1990లో పద్మశ్రీ, 2000లో భారత అత్యున్నత పురస్కారమైన పద్మభూషన్ అవార్డు లభించింది.2004లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. అగ్రి క్షిపణ కార్యక్రమానికి తొలి ప్రాజెక్ట్ డైరెక్టర్ అగర్వాలే.
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో దారుణం జరిగింది. మహిళా లా విద్యార్థినిపై మగ లా విద్యార్థి బురఖాలో యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 36 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి.
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. రాబోయే రోజుల్లో కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, ఏపీలోని రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఇజ్రాయెల్‌పై యుద్ధం విషయంలో ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్ విషయంలో వెనక్కి తగ్గితే.. దైవాగ్రహం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ప్రతీకారం విషయంలో వెనక్కి తగ్గినా.. రాజీపడినా దైవాగ్రహానికి గురికాక తప్పదని ఇరానీయులకు హెచ్చరికలు జారీ చేశారు.