ఫ్రాన్స్‌లో జరిగిన ఎయిర్‌షోలో అపశృతి చోటుచేసుకుంది. 65 ఏళ్ల పైలట్ విమానంతో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ మధ్య కుక్కలు.. మనుషులపై ఎలా దాడి చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇక చిన్నపిల్లల ప్రాణాలైతే గాల్లో కలిసిపోతున్నాయి. ఇలా దేశంలో ఆయా చోట్ల ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో తుంగభద్ర డ్యామ్‌లో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గేటు విజయవంతమైంది. విరిగిపోయిన గేటు దగ్గర మూడో ఎలిమెంట్‌ను అమర్చారు. ఇప్పటి వరకు 3 ఎలిమెంట్లను విజయవంతంగా సాంకేతిక నిపుణుల బృందం పూర్తి చేసింది. దీంతో 19వ గేటు నుంచి నీటి వృథాకు అడ్డుకట్ట పడింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మిజోరం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ఆదివారం వాయువ్య దిశగా పయనించనుందని ఐఎండీ శాస్త్రవేత్త సోమసేన్ తెలిపారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం దేశ వ్యాప్తంగా వైద్య సేవలు బంద్ అయ్యాయి. అంతేకాకుండా డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణికులు రెచ్చిపోయారు. టికెట్ చూపించమన్న పాపానికి ఏకంగా టికెట్ ఇన్స్పెక్టర్పై భౌతికదాడికి పాల్పడ్డారు. ముగ్గురు ప్రయాణికులు టీసీపై దాడి చేశారు. ట్రైన్ కోచ్‌లోని రైలింగ్‌కు నొక్కి ఇష్టానురీతిగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో మునుపెన్నడూ లేనంతగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. బాబోయ్.. అంటూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో విమానాశ్రయంలో రేడియోధార్మిక పదార్థం లీకైనట్లు సమాచారం రావడంతో తీవ్ర కలకలం రేపింది. కార్గో ప్రాంతంలో లీక్ కావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు
అమెరికాలో తెలంగాణకు చెందిన రాజేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రాజేష్ మృతికి కారణమేంటో తెలియలేదు. మృతదేహం స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధిత కుటుంబం కోరుతోంది. అలాగే మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.