Italy: విలాసవంతమైన నౌక మునక ఘటనలో మిలియనీర్, అతడి కుమార్తె మృతదేహాలు లభ్యం
- విషాదం మిగిల్చిన ఇటలీ విలాసవంతమైన నౌక ప్రయాణం
- గల్లంతైన మిలియనీర్ మైక్ లించ్.. కుమార్తె డెడ్‌బాడీ గుర్తింపు
- కన్నీటిపర్యంతమైన కుటుంబ సభ్యులు.. బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీలో విలాసవంతమైన నౌక మునక ప్రమాదంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇటీవల సిసిలీ తీరంలో విలాసవంతమైన సూపర్‌యాచ్ మునిగిపోవడంతో బ్రిటిష్ మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్ గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో నలుగురు బ్రిటిషర్లు కాగా.. ఇద్దరు అమెరికన్లు, ఒక కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఒకరి మృతదేహం అప్పుడే లభ్యమైంది. ఇక ఈ ప్రమాదం నుంచి లించ్ భార్యతో పాటు మరో 14 మంది బయటపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు. తాజాగా నౌకలో మిలియనీర్, పారిశ్రామికవేత్త మైక్ లించ్‌తో పాటు 18 ఏళ్ల కుమార్తె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
1996లో మైక్ లించ్( 59) సాఫ్ట్‌వేర్ కంపెనీని స్థాపించారు. మూడు నెలల కిందటే అమెరికాలో ఓ మోసం కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు. సిసిలీలో తీవ్ర తుపాను కారణంగా ఈ విలాసవంతమైన నౌక మునిగిపోయింది. సిసిలియన్ పోర్టు నుంచి ఆగస్టు 14న ఈ సూపర్‌యాచ్ బయలుదేరింది. ఆదివారం ఇందులో 10 మంది సిబ్బంది 12 మంది ప్యాసింజర్లు ఉన్నారు. పోర్టిసెల్లో తీరానికి చేరుకున్న సమయంలో ప్రతికూల వాతావరణం కారణంగా నౌక మునిగిపోయినట్లు సమాచారం. మైక్ లించ్, కుమార్తె మృతదేహం వెలికితీయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువులు, కుటుంబ సభ్యులంతా దు:ఖ సముద్రంలో మునిగిపోయారు
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!