Maharashtra polls: సీఎం పోస్టుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
- సీఎం పోస్టుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
- తమ పార్టీలో ఎవరికీ ఆసక్తి లేదని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వసన్నద్ధం అవుతున్నాయి. ఓ వైపు ఎన్డీఏ కూటమి.. ఇంకో వైపు ఇండియా కూటమి పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. అయితే ఎన్నికలకు వెళ్లే ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే ఈ అంశంపై NCP-SCP నాయకుడు శరద్ పవార్ మాట్లాడుతూ.. తమ పార్టీలో ఎవరికీ ఆసక్తిలేదని తేల్చేశారు. రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని భావిస్తున్నామని.. మార్పు రావాలని కోరుకుంటున్నామని.. కాబట్టి సీఎం ఎవరవుతారన్నది తమ ప్రశ్న కాదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sri Lanka-New Zealand: శ్రీలంక-న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ 6 రోజులు.. కారణమేంటంటే..?
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
ఇక ఉద్ధవ్ థాకరే కూడా ఇటీవల స్పందిస్తూ ఎవరినీ సీఎం అభ్యర్థిగా ప్రకటించినా అభ్యంతరం లేదని.. సపోర్టు చేస్తామని తెలిపారు. మొత్తానికి ఇండియా కూటమిలో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఈ ఏడాది చివరిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇటీవలే ఉద్ధవ్ థాకరే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను కలిసి వచ్చారు. సీట్ల పంపకాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pak Army: సాంకేతిక లోపం కారణంగా పాక్ లోకి ప్రవేశించిన భారత్ డ్రోన్.. పాక్ సైన్యం ఏం చేసిందంటే?
వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమని శరద్ పవార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మార్పు జరగగానే సుపరిపాలన అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇక మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే.. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక ఎంఐఎం కూడా ఇండియా కూటమిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ముస్లిం ఓట్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మజ్లి్స్ సపోర్టుతో ఇండియా కూటమి పోటీ చేయనుంది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. అదే జోష్.. అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..