కోల్‌కతాను భారీ వరదలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఎయిర్‌పోర్టులోకి నీళ్లు ప్రవేశించాయి. దీంతో భారీ ఎత్తున విమానాశ్రయంలో నీళ్లు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చైనాలో ఒక యువతి (20) తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. కుమార్తె తీరుపై నిఘా పెట్టేందుకు తల్లిదండ్రులు ఆమె బడ్ రూంలో స్పై కెమెరాను ఏర్పాటు చేశారు.
పెన్సిల్వేనియా ప్రచార సభలో ఒక మహిళ చొరవ కారణంగానే తాను ప్రాణాలతో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎన్నికల ప్రచార వేదికపైకి ఆమెను పిలిచి హగ్ చేసుకున్నారు.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇటీవల ఉత్తరప్రదేశ్ పర్యటనలో చెప్పులు కుట్టే వ్యక్తిని కలిశారు. ఈ సందర్భంగా అతడి సాధకబాధకాలు తెలుసుకున్నాక.. చెప్పులు తీసుకుని రాహుల్ కుట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాదు.. అతడు కూడా భలే ఫేమస్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నీట్ పేపర్ లీకేజీ కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. 13 మంది నిందితులపై చార్జ్‌షీటు దాఖలు చేసింది. నీట్ పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
దేశ వ్యాప్తంగా ఇటీవల రైల్వే ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. దీంతో రైల్వే ప్రయాణాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
కేరళ విలయం తన దృష్టిలో జాతీయ విపత్తు అని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి రాహుల్ వయనాడ్ ప్రకృతి విపత్తు జరిగిన ప్రాంతాలను సందర్శించారు.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై యువతిని ఎనిమిది సార్లు కత్తితో పొడిచాడు. రక్తమోడుతూ విలవిలలాడుతుంటే.. మొబైల్లో షూట్ చేస్తున్నారే తప్ప.. ఎవరు ముందుకొచ్చి రక్షించిన పాపాన పోలేదు.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. తక్షణమే లెబనాన్‌ను ఖాళీ చేయాలని భారతీయ పౌరులకు కేంద్రం సూచించింది. లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉంది