Puja Khedkar: పూజా ఖేద్కర్ వైకల్యం సర్టిఫికేట్ నకిలీదే.. హైకోర్టుకు పోలీసుల రిపోర్టు
- పూజా ఖేద్కర్ వైకల్యం సర్టిఫికేట్ నకిలీదే
- హైకోర్టుకు పోలీసుల రిపోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ యూపీఎస్సీకి సమర్పించిన దివ్యాంగ సర్టిఫికేట్ నకిలీదేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు. పూజా ఖేద్కర్ తన పేరును సర్టిఫికేట్‌లో మార్చుకుని మూడు వేర్వేరు పేర్లు ఉపయోగించి 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాసినట్లుగా పోలీసులు తెలిపారు. శారీరక, మానసిక వైకల్యాల గురించి పూజా ఖేద్కర్ అబద్ధాలు చెప్పారని, అలాగే పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఓబీసీ సర్టిఫికేట్‌ను కూడా ఫోర్జరీ చేశారని పూజా ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ ఆమె సర్వీస్‌ను రద్దు చేసింది. భవిష్యత్‌లో ఏ పరీక్షల్లో పాల్గొనకుండా వేటు వేసింది.
ఇది కూడా చదవండి: Bhopal: ధూమ్ 2 సినిమా తరహాలో చోరీకి ప్లాన్.. బెడిసికొట్టి చివరికిలా..!
Also Read
2018-2021 నుంచి, 2022-2023లో యూపీఎస్సీ పరీక్షల కోసం అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ ద్వారా నకిలీ సర్టిఫికేట్లు పొందినట్లుగా సమాచారం. UPSC పరీక్షలో అదనపు ప్రయత్నాలను పొందేందుకు తన పేరును మార్చడమే కాకుండా ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి కూడా తప్పుడు సమాచారం అందించినట్లుగా కనుగొన్నారు. పూజా ఖేద్కర్ మోసానికి పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన మొదటి నివేదికలో వెల్లడించారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉండొచ్చని అభిప్రాయపడింది.
ఇది కూడా చదవండి: Vijayawada Floods: వరద బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు..
జూలై 31న పూజా ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు లేదా ఎంపికలకు హాజరుకాకుండా ఆమెను నిషేధించింది. అంతేకాకుండా ఢిల్లీలో పూజా ఖేద్కర్‌పై మోసం, ఫోర్జరీకి సంబంధించి క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం ఊరటనిచ్చింది. అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: IC-814 Plane Hijack: భారతీయ మహిళకు శాలువాపై పుట్టినరోజు శుభాకాంక్షలు రాసిచ్చిన ఉగ్రవాది!.. అది ఇంకా ఆమెతోనే ఉంది
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు