Pune: ఫుడ్ నిరాకరించారని ట్రక్కు డ్రైవర్ బీభత్సం.. హోటల్, కారు ధ్వంసం
- పూణెలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం
- ఫుడ్ నిరాకరించారని ట్రక్కుతో హోటల్‌పై దాడి
- నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణెలో ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఫుడ్ ఇవ్వడానికి హోటల్ సిబ్బంది నిరాకరించినందుకు ట్రక్కుతో హోటల్ ముందు నానా బీభత్సం సృష్టించాడు ఓ డ్రైవర్. హోటల్ ముందు భాగాన్ని ధ్వంసం చేశాడు. అంతేకాకుండా అక్కడే నిలిపి ఉన్న కారును ఢీకొట్టాడు. దీంతో కారు డ్యామేజ్ అయింది. హోటల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వెనక్కి తగ్గలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?
Also Read
షోలాపూర్ నుంచి పూణెకు శుక్రవారం రాత్రి ఓ ట్రక్కు వచ్చి ఆగింది. హింగాన్‌గావ్‌లోని హోటల్ గోకుల్ ముందు ఆగాడు. తనకు ఆహారం ఇవ్వాలని అడిగాడు. అప్పటికే డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. అయితే హోటల్ యజమాని అతనికి ఫుడ్ పెట్టేందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన డ్రైవర్ తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనాన్ని పాడు చేయడం ప్రారంభించాడు. ఇష్టానురీతిగా ధ్వంసం చేశాడు. కారును కూడా పాడు చేశాడు. అక్కడే ఉన్న హోటల్ సిబ్బంది ఆపే ప్రయత్నం చేసినా ఏ మాత్రం తగ్గలేదు. డ్రైవర్‌పై రాళ్లు కూడా విసిరారు. అయినా కూడా శాంతించలేదు. పదే పదే ట్రక్కుతో హోటల్‌ను ఢీకొట్టాడు. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలు మొబైల్‌లో షూట్ చేశారు. అయితే టైర్లలో గాలి లేకపోవడంతో ట్రక్కు ముందుకు కదలలేదు. అక్కడే ఆపి.. తనకు ఫుడ్ పెట్టాలని చేతులు జోడించి బతిమాలాడు. అయితే డ్రైవర్‌పై కొందరు దాడి చేసే ప్రయత్నం చేయగా.. మరికొందరు అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Tollywood : వినాయక చవితి కానుకగా టాలీవుడ్ స్పెషల్ అప్ డేట్స్..
VIDEO | Maharashtra: A truck driver rammed his vehicle into a hotel building in #Pune after he was reportedly denied food. The truck driver was allegedly drunk. The incident took place on Friday night.#PuneNews #maharashtranews
(Source: Third Party)
(Full video available on… pic.twitter.com/TrPEF1ZxrA
— Press Trust of India (@PTI_News) September 7, 2024
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!