Assam: 3 వారాల తర్వాత గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుల అరెస్ట్
- 3 వారాల తర్వాత గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుల అరెస్ట్
- అస్సాంలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
- ప్రధాన నిందితుడు చెరువులో పడి మృతి
- మిగతా ఇద్దరు నిందితులు శుక్రవారం అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అస్సాం రాష్ట్రంలో 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పదో తరగతి విద్యార్థినిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. రోడ్లపైకి వచ్చి నానా హంగామా సృష్టించారు. దీంతో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందించి.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Game Changer: అంత హడావుడి చేసి.. ఇలా గాలి తీసేశారు ఏంటి గురూ!
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
నాగోన్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మూడు వారాల తర్వాత అస్సాం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆగస్ట్ 24 న పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని చెరువులో దూకి చనిపోయాడు. ఆగస్టులో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ట్యూషన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు అడ్డుకుని అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ పరిణామంలో ప్రధాన నిందితుడు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. మొత్తానికి మూడు వారాల తర్వాత ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరిని అస్సాంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేయగా… మరొకరిని నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఇది కూడా చదవండి: Roshan Kanakala: హేయ్ రోషన్… నువ్వేనా.. ఇలా తయారయ్యావ్ ఏంటి?
ఆగస్టు 22న ఢింగ్‌లో 14 ఏళ్ల బాలిక ట్యూషన్ ముగించుకుని ఇంటికి వస్తుండగా మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను చుట్టుముట్టి అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు తఫాజుల్ ఇస్లామ్‌ను మరుసటి రోజు అరెస్టు చేసే ప్రయత్నం చేయగా చెరువులో పడి చనిపోయాడు. ఇద్దరు సహచరులు పరారీలో ఉండడంతో 3 వారాల తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం నిందితులిద్దరినీ విచారణ నిమిత్తం నాగోన్ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: Uruku Patela Review: ఉరుకు పటేలా రివ్యూ.. థియేటర్లకు ఉరుకులు పెట్టించేలా ఉందా? లేదా?
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?