Lucknow Building Collapses: లక్నోలో కూలిన బిల్డింగ్.. నలుగురు మృతి
- లక్నోలో కూలిన బిల్డింగ్
- నలుగురు మృతి.. 20 మందికి గాయాలు
- కొనసాగుతున్న సహాయ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. 15 మందిని సురక్షితంగా రక్షించారు. మరో 20 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అగ్నిమాపక శాఖ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: India-UAE Ties: సోమవారం భారతదేశానికి రానున్న యూఏఈ క్రౌన్ ప్రిన్స్..
Also Read
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar in Kyiv: భారత్ రష్యా చమురు కొనుగోలును ఆపుతుందా? జెలెన్స్కీకి జైశంకర్ క్లారిటీ..
- Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
లక్నోలోని ట్రాన్స్‌పోర్టు నగర్‌లో మధ్యాహ్న సమయంలో 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. రంగంలోకి దిగిన సహాయ బృందాలు క్షతగాత్రులను ఆసియానా ప్రాంతంలోని లోక్‌బంధు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
లక్నోలో భవనం కూలడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ఈ ప్రమాదం బాధాకరం అన్నారు. లక్నో జిల్లా మేజిస్ట్రేట్‌తో ఫోన్‌లో మాట్లాడి సంఘటన స్థలంలో పరిస్థితి గురించి సమాచారాన్ని తెలుసుకున్నట్లు చెప్పారు. స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బాధితులకు అన్ని విధాలుగా సహాయం అందిస్తామని కేంద్రమంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు.
#WATCH | Lucknow building collapse | Rescue operations to evacuate the trapped people are underway. Fire Department and NDRF teams are at the spot. The evacuated people are being sent to the hospital.
So far, 4 people have been evacuated in the incident. pic.twitter.com/gN3GWrAQ4X
— ANI (@ANI) September 7, 2024
#WATCH | Lucknow, Uttar Pradesh: CFO Mangesh Kumar says, "… 4 people have been rescued safely so far and have been sent to the hospital. More people are said to be trapped… The exact number of the trapped people is yet to be ascertained…" https://t.co/aFRN9WA9qc pic.twitter.com/B53yhMjW0T
— ANI (@ANI) September 7, 2024
लखनऊ में एक भवन के गिरने से हुई दुर्घटना का समाचार अत्यंत पीड़ादायक है। मैंने लखनऊ के ज़िलाधिकारी से फ़ोन पर बातचीत करके घटनास्थल पर हालात की जानकारी प्राप्त की है। स्थानीय प्रशासन मौक़े पर राहत एवं बचाव कार्य कर रहा है और पीड़ितों की हरसंभव मदद में जुटा है।
— Rajnath Singh (@rajnathsingh) September 7, 2024
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!