కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో బాధిత కుటుంబానికి పోలీసులు డబ్బులు ఆఫర్ చేశారంటూ గత వారం వార్తలు హల్‌చల్ చేశాయి. బాధితురాలి తండ్రి ఈ మేరకు ఆరోపణలు గుప్పించారు. దీంతో మీడియాలో కథనాలు సంచలనంగా మారాయి. తాజాగా సోమవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. డబ్బులు ఆఫర్ చేసిన వార్తలను ఖండించారు. వామపక్ష పార్టీల ప్రమేయంతో కేంద్రం కుట్ర చేసిందని ఆరోపించారు. కేవలం ఇదొక అపవాదు మాత్రమేనని కొట్టిపారేశారు.
ఇది కూడా చదవండి: Tragedy: బుడమేరులో శవమై తేలిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసును కప్పిపుచ్చడానికి పోలీసులు ప్రయత్నించారని.. నిశ్శబ్దంగా ఉండటానికి పోలీసులు తమకు లంచం ఆఫర్ చేశారని బాధితురాలి తండ్రి గత వారం ఆరోపించారు. పోలీసులు మొదటి నుంచి కేసును మూసివేయడానికి ప్రయత్నించారని.. కనీసం మృతదేహాన్ని చూసేందుకు కూడా అనుమతించలేదని వాపోయారు. పోస్టుమార్టానికి తీసుకెళ్లే సమయంలో పోలీస్ స్టేషన్‌లో వేచి ఉండాల్సి వచ్చిందని… మృతదేహాన్ని అప్పగించేటప్పుడు ఒక సీనియర్ పోలీస్ అధికారి డబ్బు ఇచ్చాడని.. వెంటనే తిరస్కరించినట్లు బాధితురాలి తండ్రి చెప్పుకొచ్చాడు.
సోమవారం ఇదే అంశంపై మమత మాట్లాడుతూ.. డబ్బు జీవితానికి పరిహారం కాదని బాధితురాలి తల్లిదండ్రులకు చెప్పానన్నారు. కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా అర్థవంతమైనది చేయాలని భావిస్తే.. ప్రభుత్వం వారి పక్షాన నిలుస్తుందన్నారు. వారు తనను కలవవచ్చని మమత చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: తెలుగు భాష ముఖ్యం కాదంటే.. అక్కడి వారిని అవమానించిట్లే..
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసు దర్యాప్తు సవ్యంగా జరగడం లేదని.. కోల్‌కతా హైకోర్టు జోక్యం చేసుకుని సీబీఐకి అప్పగించింది. ఇక సోమవారం స్టేటస్ రిపోర్టును సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించింది. కానీ దీనిపై న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. వారం రోజులు గడువు ఇచ్చి.. మరో రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Dr K Laxman: బాసర విద్యార్థులు పోరు బాట పడితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైన లేదు..