అగ్ర రాజ్యం అమెరికాలో 22 అంతస్తుల టవర్‌ను సెకన్ల వ్యవధిలో కూల్చేశారు. లూసియానాలోని లేక్ చార్లెస్ ప్రాంతంలో పాడుబడిన హెరిటేజ్ టవర్ ఉంది. ఇటీవల తుపాన్‌కు దెబ్బకు భారీగా నష్టం వాటిల్లింది. అయినా కూడా స్థిరత్వం రాలేదు. దీంతో టవర్‌ను కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా శనివారం ఈ టవర్‌ను సెకన్లలో కూల్చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Giorgia Meloni: ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ పరిష్కరించగలదు.. ఇటలీ ప్రధాని కామెంట్స్..
లూసియానాలోని లేక్ చార్లెస్ ప్రాంతంలో 22 అంతస్తుల టవర్ సెకన్లలో కూలిపోయిన తర్వాత దట్టమైన పొగ అలుముకుంది. కూల్చివేత మాత్రం 15 సెకన్లలో జరిగిపోయింది. బిల్డింగ్ నిర్మాణం అంతా కూలిపోయింది. భవనం కుప్పకూలడంంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళితో కప్పివేసింది. దాదాపు ఐదు అంతస్తుల ఎత్తులో రాళ్ల కుప్ప మిగిలింది.
ఇది కూడా చదవండి: Weight Loss Tips: త్వరగా బరువు తగ్గాలా? అయితే ఈ టిప్స్ పాటించండి
గతంలో క్యాపిటల్ వన్ టవర్ అని పిలిచే ఈ భవనం లారా మరియు డెల్టా తుఫానుల కారణంగా తీవ్రంగా దెబ్బతింది. భవనం యజమానులు మరమ్మతు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కూల్చివేయాలని నిర్ణయించుకున్నారని వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.