Haryana: బెడిసికొట్టిన ఆప్-కాంగ్రెస్ పొత్తు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన
- హర్యానాలో బెడిసికొట్టిన ఆప్.. కాంగ్రెస్ పొత్తు
- అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇండియా కూటమిలోని భాగమైన ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. కానీ చర్చలు సఫలీకృతం కాలేదు. ఆప్ ఆశించిన విధంగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సింగిల్ డిజిట్‌కే హస్తం పార్టీ పరిమతం చేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి రుచించలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Nandikotkur Crime: మహిళ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం ప్రకటించింది, పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని ప్రత్యర్థులను హెచ్చరించింది. సీట్ల పంపకంపై వచ్చిన విభేదాల కారణంగా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు నిలిచిపోయాయని ప్రకటనలో వెలువడింది.
కాంగ్రెస్‌తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అవసరమైతే పార్టీ ఒంటరిగా వెళ్లడానికి సిద్ధంగా ఉందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో నిరంతరం పని చేస్తోందన్నారు. సునీతా కేజ్రీవాల్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని.. పార్టీ బలంగా ఉందని కక్కర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఆప్ తన అభ్యర్థులను ఎన్నికలకు ప్రకటిస్తుందని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్‌తో చర్చలు కొనసాగించే అవకాశం ఉందని సూచించిన ఆమె.. ఇక ముగింపునకు వచ్చినట్లేనని పేర్కొన్నారు. ఇక ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. హర్యానాలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఐదు సీట్ల కోసం కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకుందనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితాలను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
"Ready to fight elections on every seat", says AAP MP amid Cong-AAP alliance speculation
Read @ANI Story | https://t.co/K7j8so2Kng#Congress #AAP #AssemblyElections #Haryana pic.twitter.com/PTmgdn7NLj
— ANI Digital (@ani_digital) September 7, 2024
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!