కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ జార్ఖండ్ పర్యటనలో అపశృతులు చోటుచేసుకున్నాయి. బహరగోరాలో జరిగే బహిరంగ ర్యాలీకి వెళ్తుండగా ఒక్కసారిగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం బురదలో కూరుకుపోయింది. ఓ వైపున కుండపోత వర్షం.. మరో వైపు వాహనం ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ సూచీలు కూడా జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మన మార్కె్ట్ మాత్రం శుక్రవారం ప్రదర్శించిన దూకుడునే సోమవారం చూపించింది.
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలో బెంగళూర్‌లో మహాలక్ష్మీ (29) అనే మహిళ దారుణ హత్యకు గురి కావడం తీవ్ర సంచలనంగా మారింది. మహాలక్ష్మీని ముక్కలు.. ముక్కలుగా నరికి గదిలో రిఫ్రిజిరేటర్లో పెట్టడంతో దుర్వాసన వెదజల్లింది. దాదాపు 50 ముక్కలుగా నరికివేయబడింది.
అమెరికా పర్యటనలో సిక్కులపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిక్కులు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. బీజేపీ నేతల తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ప్రస్తుతం రెజ్లర్ వినేష్ ఫోగట్.. ఆమె కజిన్ సిస్టర్ బబిత ఫోగట్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే వినేష్.. కాంగ్రెస్‌లో చేరడాన్ని బబిత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వినేష్ ఫోగట్ చేసిన వ్యాఖ్యలపై బబిత ఘాటుగా స్పందించారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. అత్యంత ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికలు జరిగాయని ఎన్నికల కమిషన్ ఛైర్మన్ ప్రకటించారు. పోలింగ్ ముగిసిన వెంటనే పోస్టల్ ఓట్ల లెక్కింపు.. తర్వాత సాధారణ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆదివారం ఫలితాలు వెలువడనున్నాయి.
కొంత మంది పామును చూసినా.. చిన్న పురుగును చూసినా హడలెత్తిపోతారు. కొందరు భయంతో ఎలాంటి వాటిని చూసినా వణికిపోతారు. కాళ్లు దడదడలాడుతుంటాయి. అలాంటిది ఒక వ్యక్తి పెద్ద పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అది మాత్రం హఠాత్తుగా ఎటాక్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. తాజాగా గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 22 మంది మరణించారు. గాజా నగరంలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 22 మంది పాలస్తీనియన్లు మరణించారు. 30 మంది గాయపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.