Xiaomi FX Pro 55 Inch: స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా.. షియోమీ నుంచి వచ్చిన 55 అంగుళాల FX Pro QLED 4K స్మార్ట్ ఫైర్ టీవీ ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. గతంలో రూ.62,999గా ఉన్న ఈ ప్రీమియం QLED టీవీ ధర, ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.32,999కే అందుబాటులో ఉంది. దాదాపు 48 శాతం తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీ రాబోతుంది. ఈ ధరలోనే 55 అంగుళాల QLED 4K టీవీ రావడం అనేది బిగ్ డీల్ అని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ టీవీపై అమల్లో ఉన్న డిస్కౌంట్‌తో మిడ్-రేంజ్ బడ్జెట్‌లోనే ప్రీమియం ఫీచర్లను పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా క్రెడిట్ కార్డులపై EMI వడ్డీ ఆదా రూ.₹1,486 వరకు కూడా లభిస్తోంది. గత నెలలోనే 1,000కిపైగా యూనిట్లు అమ్ముడుపోవడంతో ఈ టీవీకి ఉన్న డిమాండ్‌ను చూపిస్తోంది. Xiaomi FX Pro టీవీకి 55 అంగుళాల QLED ప్యానెల్, Ultra HD 4K (3840×2160 పిక్సెల్స్) రిజల్యూషన్ ఉంది. HDR10+ సపోర్ట్, 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ వల్ల అన్ని కోణాల్లోనూ స్పష్టమైన, బ్రైట్ విజువల్స్ కనిపిస్తాయి. అలాగే ఇది బెజెల్-లెస్ డిజైన్ టీవీకి ప్రీమియం లుక్ ఇస్తుంది.
ఈ టీవీ Fire OS 8పై పనిచేస్తుంది. వన్-క్లిక్ బటన్‌లతో Prime Video, Netflix, YouTube యాక్సెస్ లభిస్తుంది. అలాగే Alexa Voice Assistant సపోర్ట్ కూడా దీనికి ఉండడంతో వాయిస్ కమాండ్స్‌తోనే టీవీని కంట్రోల్ చేయవచ్చు. అలాగే Chromecast బిల్ట్-ఇన్ ఉండటం దీనికి మరో ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు. ఇంకా సౌండ్ విషయంలో కూడా ఈ టీవీ అస్సలు డిజప్పాయింట్ చేయదు. 34 వాట్ల డ్యూయల్ స్పీకర్లు, Dolby Audio సపోర్ట్‌తో థియేటర్ లాంటి అనుభూతిని వీక్షకులకు ఇస్తుందని చెబుతున్నారు. Dolby, DTS, MP3, FLAC లాంటి అనేక ఆడియో ఫార్మాట్లకు ఇది సపోర్ట్ చేస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఈ టీవీలో HDMI, USB (2 పోర్టులు), Wi-Fi, Ethernet, Bluetooth, అలాగే 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి. 60Hz రిఫ్రెష్ రేట్, Eye Comfort Mode, బ్లూటూత్ రిమోట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం QLED డిస్‌ప్లే, Fire TV స్మార్ట్ ఫీచర్లు, సూపర్ ఆడియో క్వాలిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు ₹32,999 ధరలో లభించడం Xiaomi FX Pro 55 అంగుళాల టీవీని ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్‌గా నిలబెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారీ ధర తగ్గింపు కారణంగా, కొత్త 4K స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది సరైన ఎంపికగా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
READ ALSO: India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్.. బౌలర్‌ను మార్చిన సూర్య! రిజల్ట్ చూశారుగా..