CM Chandrababu Naidu: తెలుగు ప్రజల గౌరవం కోసం పొట్టిశ్రీరాములు చేసిన ఆత్మార్పణ చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైనా సీఎం పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందించి శాలువాలతో సత్కరించారు. పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో, స్వాతంత్ర్యానంతరం తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడారని గుర్తు చేసుకున్నారు. పాలకుల వివక్ష కారణంగా నలిగిపోయిన తెలుగు వారికి రాష్ట్రాన్ని సాధించి పెట్టారని.. గత సంవత్సరమే చెప్పాను నెల్లూరులో ఉన్న ఇంటిని ఒక మెమోరియల్ గా చేస్తానన్నారు. నెల్లూరు లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.. అమరావతి లో కూడా పొట్టి శ్రీరాములు మెమోరియల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
READ MORE: Maoists Document : మావోయిస్టుల సెన్సేషనల్ డాక్యుమెంట్ బట్టబయలు
58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. “నెల్లూరు లో పొట్టి శ్రీరాములు ప్రారంభించిన హాస్పటల్ ని అభివృద్ధి చేసి ఆ ప్రాంత ప్రజలకి వైద్య సేవలు అందిస్తాం.. రాబోయే రోజుల్లో స్టేట్యూ అఫ్ సాక్రీఫైస్ గా పేరు పెడతాం.. ఆయన త్యాగం ఒక స్ఫూర్తి అందరికి తెలుస్తుంది.. నమ్మిన సిద్ధాంతం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని సాధించారు.. ఆయన కృషితోనే 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైంది.. ఆ తర్వాత నవంబరు 1, 1954న ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైంది.. కొందరు ఈ తేదీలపై రాజకీయం చేస్తున్నారు. అందుకే ఆలోచన చేసి అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ చేసిన దినాన్ని డే ఆఫ్ శాక్రిఫైస్ కింద నిర్వహించాలని నిర్ణయించాం.. వచ్చే ఏడాది మార్చి 16 వరకూ పొట్టి శ్రీరాములు శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నాం.. భావితరాలకు గుర్తుండేలా పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నాం.. పొట్టిశ్రీరాములు త్యాగానికి గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టారు.. నేను నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టి కేంద్రానికి పంపాం.. ఆ తర్వాతే కేంద్రం జిల్లా పేరును పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాగా నోటిఫై చేసింది.. చెన్నైలో ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని సంరక్షించాలని నిర్ణయించాం.. భావితరాలకు గుర్తుండేలా దానిని మెమోరియల్ గా తీర్చిదిద్దుతాం.. పొట్టిశ్రీరాములు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు.. ఆయన తెలుగు ప్రజల ఆస్తి, సెంటిమెంట్, గుండె చప్పుడు..” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.