తిరుపతి సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంలో హైడ్రామా నెలకొంది. కార్యాలయంలో అటెండర్ నానా హంగామా సృష్టించాడు. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయాలంటూ మహిళా సబ్ రిజిస్టర్‌పై అటెండర్ దౌర్జన్యానికి దిగాడు. రెండు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని చనిపోతానంటూ డ్రామా నడిపాడు.
ఈ మధ్య యువతకు రీల్స్ పిచ్చి బాగా ముదురుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా సోషల్ మీడియా మోజులో పడి కొందరు ఏం చేస్తున్నారో.. వారికే అర్ధం కాకుండా రెచ్చిపోతున్నారు. ఏ చోటు వదలకుండా వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ రీల్స్ కోసం తన ప్రాణాలే కాకుండా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా.. అతిషిచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ నేతలు, తదితరులు హాజరయ్యారు.
ఉత్తర జపాన్‌పై ప్రకృతి మరోసారి ప్రకోపించింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో భారీ భూకంపంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణంలో మరోసారి ప్రకృతి కన్నెర్ర జేసింది. శనివారం జపాన్‌లోని ఉత్తర మధ్య ప్రాంతమైన నోటోలో భారీ వర్షం కురిసింది.
ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత భారత వైమానిక దళానికి చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమర్ ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం నుంచి నియామకం అమలులోకి వస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
బెంగళూరు ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం సృష్టించింది. కుంబల్‌గోడులోని ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల వాష్‌రూమ్‌లో అమ్మాయిల దృశ్యాలను 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మొబైల్లో షూట్ చేశాడు. దీన్ని గమనించిన సహా విద్యార్థులు.. నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ (79) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతిచెందారు.ఆరు దశాబ్దాలకు పైగా విశిష్టమైన కెరీర్‌ను కొనసాగించింది. కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. పొన్నమ్మ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్యానాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుదీరినా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుందని తెలిపారు. తమ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయం చేయాలంటూ వైద్యులు వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ కోర్టు షాకిచ్చింది.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ రైల్వేస్టేషన్లో ఓ పాము హల్చల్ సృష్టించింది. 6 అడుగుల పొడవైన పాము కలకలం సృష్టించింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. భయంతో వణికిపోయారు. కొందరు పరుగులు తీశారు.