పార్లమెంట్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహనం కోల్పోయారు. సభలో తన ప్రసంగానికి అడ్డు తగిలిన విపక్ష సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..
సోమవారం వందేమాతరం 150వ వార్షికోత్సవంపై పార్లమెంట్‌లో ప్రధాని మోడీ చర్చ చేపట్టారు. దాదాపు 12 గంటల పాటు చర్చ జరిగింది. ఇక ప్రధాని మోడీ తర్వాత రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. ఆ సమయంలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. కాంగ్రెస్ టార్గెట్‌గా రాజ్‌నాథ్‌సింగ్ విమర్శలు గుప్పించారు. దీంతో విపక్ష సభ్యులంతా ‘కూర్చోండి.. కూర్చోండి’’ అంటూ రాజ్‌నాథ్‌సింగ్‌ను ఉద్దేశించి నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారి కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘కూర్చోమనడానికి మీరెవరంటూ’’ ఫైరయ్యారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వైపు చూసి జోక్యం చేసుకోవాలని కోరారు. బీజేపీ సభ్యులు కూడా మీకెంత ధైర్యం అంటూ విపక్ష సభ్యులపై మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: నిబంధనలు పౌరులను ఇబ్బంది పెట్టడానికి కాదు.. ఇండిగో సంక్షోభంపై మోడీ సీరియస్
Who will make me sit?
Who has the power to make me sit?
Defence Minister Rajnath Singh suddenly appeared in a fierce, wrathful form today.@rajnathsingh pic.twitter.com/V7rcOSdm1F
— RANA SANGA (@Bapparawal1234) December 8, 2025