ఏ జంటైనా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉంటే ఎవరికీ సమస్య ఉండదు. అంతేకాని పెళ్లి చేసుకున్నాక మాటిమాటికీ గొడవలు పడి విడాకుల కోసం కోర్టు మెట్టులు ఎక్కితే మాత్రం అందరికీ సమస్యే. ఆ జంటతోనే ఆయిపోతుందంటే కాదు.. పెళ్లి చేసినోళ్లను.. సాక్షి సంతకాలు పెట్టినోళ్లను కూడా న్యాయస్థానాలు విచారణకు పిలుస్తుంటాయి. ఈ క్రమంలో పూజారులు విసిగెత్తిపోయారు. దీంతో బెంగళూరు ప్రముఖ ఆలయ పూజారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆలయంలో వివాహాలు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Sonia Gandhi: సోనియాగాంధీకి ఎదురుదెబ్బ.. పౌరసత్వానికి ముందే ఓటర్ లిస్ట్‌లో పేరు ఉండడంపై నోటీసు
శతాబ్దాల నాటి వారసత్వ పుణ్యక్షేత్రం. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే ఆలయాలలో ఒకటైన హలసూరు సోమేశ్వర స్వామి ఆలయం ఒకప్పుడు ప్రసిద్ధ వివాహ వేదికగా ఉండేది. గతంలో ఈ ఆలయంలో 100 నుంచి 150 వివాహాలు నిర్వహించింది. ఆలయ ప్రాంగణంలో వివాహాలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. వివాహాలు విఫలమైనప్పుడు చట్టపరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. తన వివాహాన్ని నిర్వహించడానికి ఆలయం నిరాకరించిందని ఆరోపిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం (CMO)కి ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆలయ నిర్ణయం బహిరంగమైంది.
ఇది కూడా చదవండి: Nagpur: నాగ్‌పూర్‌లో విషాదం.. కబడ్డీ ప్లేయర్ ఆత్మహత్య
నివేదిక ప్రకారం.. విడాకుల విచారణల సమయంలో కోర్టులు తరచుగా సమన్లు జారీ చేసేవని ఆలయ సిబ్బంది తెలిపారు. ఆలయ కమిటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గోవిందరాజు మాట్లాడుతూ.. చాలా మంది జంటలు నకిలీ పత్రాలను ఉపయోగించి ఆలయంలో వివాహం చేసుకున్నారని చెప్పారు. అనంతరం వారి కుటుంబాలు ఆలయాన్ని ఆశ్రయించాయని.. కొన్ని సందర్భాల్లో చట్టపరమైన వివాదాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆలయ పూజారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.