మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కబడ్డీ ప్లేయర్ కిరణ్ సూరజ్ దాధే ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఇంకోవైపు ఉద్యోగం లేకపోవడం, వివాహం విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో మానసికంగా కృంగిపోయింది. దీంతో కిరణ్ సూరజ్ దాధే ప్రాణాలు తీసుకుంది. ఆమె మరణవార్తతో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: Rajnath Singh: లోక్‌సభలో సహనం కోల్పోయిన రాజ్‌నాథ్‌సింగ్.. విపక్ష సభ్యులపై ఆగ్రహం
కిరణ్ సూరజ్ దాధే.. 2020లో స్వప్నిల్ జయదేవ్ లాంబ్‌ఘరేని వివాహం చేసుకుంది. కిరణ్.. ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి వివాహం చేసుకున్నాడు. కానీ నాటి నుంచి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడు. మానసికంగా..శారీరికంగా వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల దగ్గర నివాసం ఉంటుంది. భర్త నుంచి వేధింపులు ఎక్కువ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురై డిసెంబర్ 4న విషం సేవించింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. దీంతో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: నిబంధనలు పౌరులను ఇబ్బంది పెట్టడానికి కాదు.. ఇండిగో సంక్షోభంపై మోడీ సీరియస్
ఇదిలా ఉంటే కిరణ్ సూరజ్ దాధేకు నిత్యం బెదిరింపులు, దుర్భాషలు రావడంతో కోర్టులో విడాకుల పిటిషన్ వేయాలని కుటుంబ సభ్యులు కోరారు. ఇక బెదిరింపులకు సంబంధించిన సందేశాలను సాక్ష్యంగా మొబైల్‌లో సేవ్ చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త స్వప్నిల్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.