దేశ రాజధాని ఢిల్లీలో అతిషి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో అత్యంత వేగంగా వాయు కాలుష్యం పెరిగిపోవడంతో ముందు జాగ్రత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14(సోమవరం) నుంచి జనవరి 1 వరకు హస్తినలో టపాసుల కాల్చివేతను నిషేధం విధించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యాటవరణ మంత్రి గోపాల్ రాయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
గత వారం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నష్టాలను చవిచూసింది. ఈ వారం మాత్రం అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండడంతో సోమవారం ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఎన్సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ముంబై ఉలిక్కిపడింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తు్న్నారు. ఇక తాజా విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో చేరారు. ఉద్ధవ్ థాకరే గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయను యాంజియోగ్రఫీ నిర్వహించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా కన్నుమూశారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా తుదిశ్వాస విడిచారు. ఉద్యమకారుడిగా, రచయితగా, విద్యావేత్తగా పేరు తెచ్చుకున్నారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని 2014లో సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.
దేశ వ్యాప్తంగా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం నమోదు కార్యక్రమం అక్టోబర్ 12న ప్రారంభమైంది. నెలకు రూ.5,000 స్టైపెండ్‌ని అందించే ఈ పథకం శనివారం ప్రారంభమైంది. విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్‌తో సహా పలు సంస్థల్లో ఆఫర్లు లభించనున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధిక ఇంటర్న్‌షిప్‌లు ఉన్నాయి. తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మొసలి నివాసల దగ్గర హల్చల్ చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అనంతరం దాన్ని తాళ్లతో బంధించి ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా వేడుకలు అంబరాన్నంటాయి. మాదవ్ దాస్ పార్క్‌లో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగించారు. అనంతరం వారితో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. అయితే తమ భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. వీరికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు కూడా సామూహిక రాజీనామాలు చేశారు. ఒక్కో రోజు కొంత మంది రాజీనామాలు సమర్పించారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో అగ్ర రాజ్యం అమెరికా కూడా సిరియాపై విరుచుకుపడింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే లక్ష్యంగా వరుసగా గగనతల దాడులకు తెగబడింది. శుక్రవారం నుంచి పలుమార్లు దాడి చేసినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది.