హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ అక్టోబర్ 17న ప్రమాణస్వీకారం చేయనున్నారు. పంచకులలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారని కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.
దేశవ్యాప్తంగా డీమార్ట్ పేరిట సూపర్ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిలో రూ.710.37 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
విజయ దశమి రోజున గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి తాలూకాలోని జసల్‌పూర్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ కంపెనీ గోడ కూలి ఏడుగురు మరణించారని మెహసానా జిల్లా ఎస్పీ తరుణ్ దుగ్గల్ తెలిపారు.
ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ నిర్మాణాత్మక మార్పులకు సిద్ధమైంది. రాబోయే నెలల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. శ్రామిక శక్తిలో 10 శాతం తగ్గుతుందని ప్రకటించింది. దీంతో దాదాపు 17,000 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది. ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు, ఉద్యోగులపై తొలగింపు ప్రభావం చూపుతుందని బోయింగ్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ తెలిపారు.
దేశంలోనే ప్రధాన నగరాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అందరికీ తెలిసిందే. రోడ్డుపైకి వచ్చామంటే.. ఎప్పుడు ఇంటికి చేరుతామో.. ఎప్పుడు ఆఫీస్‌కు వెళ్తామో ఎవరికీ తెలియదు. అంతగా వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి.
లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులు కొనసాగిస్తోంది. ఏకధాటిగా ఐడీఎఫ్ దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి దగ్గర పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఇజ్రాయెల్ రాకెట్లు బీరుట్‌ను తాకినప్పుడు యూఎన్ కార్యాలయం సమీపంలో పడ్డాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఎట్టకేలకు పీడబ్ల్యూడీ అధికారులు అధికారిక నివాసం కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి సోమవారం అతిషి షిప్ట్ అయ్యారు. వస్తువులన్నీ తరలించారు.
ప్రేమికురాలి కోసం కొందరు ఎంతకైనా తెగిస్తుంటారు. ఆ మోజులో ఉన్నవారు మైకంలో ఉండి ఏం చేస్తారో కూడా అర్థం కాదు. ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుదారులకు షాకిచ్చింది. క్రెడిట్ కార్డుల విషయంలో కీలక మార్పులు చేసింది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై లభించే రివార్డు ప్రయోజనాల్లో కోత పెట్టింది.