దేశ వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా వేడుకలు అంబరాన్నంటాయి. మాదవ్ దాస్ పార్క్‌లో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిర్వహించిన ‘రావణదహన్’ కార్యక్రమంలో మోడీ, ముర్ము విల్లు చేతపట్టి శరసంధానం చేశారు. ముందుగా మోడీ, ముర్ము రామలక్ష్మణ వేషధారులకు తిలకం దిద్దారు.
నవరాత్రుల చివరిరోజున విజయదశమిని దేశ వ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన పురాణగాథలు కూడా చాలానే ఉన్నాయి. దుష్టుడైన రావణాసురుని రాముడు యుద్ధంలో ఓడించిన రోజును విజయదశమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దసరా పండుగతోనే దీపావళి సన్నాహాలు కూడా మొదలవుతాయి. విజయదశమి వెళ్లిన 20 రోజులకు దీపావళి వేడకను అత్యంత వైభవంగా దేశప్రజలు జరుపుకుంటారు. ఈనెల 31న దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు.
President Murmu, PM Modi attend Dussehra celebrations
Read @ANI story | https://t.co/iqjpyWo6J6#PresidentMurmu #PMModi #Dussehra pic.twitter.com/tVEGR2bOgV
— ANI Digital (@ani_digital) October 12, 2024
Congress Parliamentary party chairperson Sonia Gandhi and Lok Sabha LoP Rahul Gandhi arrive at Nav Shri Dharmik Leela Committee Red Fort, Delhi to attend the #Dussehra2024 celebrations pic.twitter.com/V90I86cG0F
— ANI (@ANI) October 12, 2024